అడవిలో ఆగిన రైలు.. కనిపించిన పోలీసులు.. మహిళకు గుండెపోటు
అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు.
అడవి(Forest) ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూ లేని ప్రదేశం. కిటికిలో నుంచి చూస్తే.. చీకటి. వెంటనే పోలీసులు వచ్చారు. అడవి మధ్యలో పోలీసులు రావడం ఏంటి.. తనిఖీలు చేయడమేంటని.. ఓ మహిళ ఆందోళనకు గురైంది. గుండెపోటు వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో జరిగింది.
నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్(narasapur nagarsol express) రైలులో సంధ్య అనే మహిళ ప్రయాణిస్తోంది. సికింద్రాబాద్ కు చెందిన ఆమె షిరిడీ వెళ్లి.. తిరిగి వస్తోంది. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నారని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం వచ్చింది. అదే రైలులో సంధ్య ప్రయాణిస్తోంది. పోలీసులు తనిఖీలు చేశారు.
అయితే ఈ విషయం తెలిసిన.. అక్రమ రవాణా చేసే వారు.. అడవి మధ్యలో చెయిన్ లాగి రైలును ధర్మాబాద్-బాసర అటవీ ప్రాంతంలో ఆపారు. మరోవైపు పోలీసులు(Police) తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనలతో సంధ్య ఆందోళనకు గురైంది. ఆమెకు ఛాతిలో నొప్పి మెుదలైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది.. నిజామాబాద్ రైల్వే(Railway) అధికారులకు సమాచారం ఇచ్చారు.
నిజామాబాద్ రాగానే.. సంధ్యను అప్పటికే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళనకు గురై అలా జరిగినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సంధ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స అనంతరం ఆమెను.. డిశ్ఛార్జి చేశారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు తెలిపారు.
తనిఖీల్లో 20 బ్యాగుల నిషేధిత నల్ల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన చూసే.. సంధ్య షాక్ కు గురయ్యారు. నిజామాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలో నల్లబెల్లాన్ని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు వెళ్లారు.
****************************
ఈ రోజు ఢిల్లీ హైకోర్టు లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన కేసు వాదనలు జరిగాయి..
రేవంత్ రెడ్డి వేసిన కేసుపైన మీకు ఏ శాఖల పైన అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని స్వేచ్చ ఇచ్చిన కోర్టు..
ఈ కేసును ముగిస్తూ.. మరో పిటిషన్ వేసుకోవడానికి అవకాశాలు ఇచ్చిన.కోర్ట్..
టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ తీస్కున్న నిర్ణయానికి ఎన్నికల సంఘం అనుమతి లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు కేసుకు ప్రాధాన్యత..
గతంలో టిఆర్ఎస్ బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి కేసు..
ఈ కేసులో ఐ.టి శాఖ కు సంబంధించిన విచారణ పెండింగ్ లో ఉంది.
ఈ పరిశీలన పూర్తి కాకుండా బిఆర్ఎస్ గా పేరు మార్చవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..
డిసెంబర్ 6వ తేదీ లోపు బిఆర్ఎస్ విషయంలో అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ప్రకటన చేసింది.
ఎన్నికల సంఘం ప్రకటన మేరకు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు నమోదు చేశారు.
అయిన కూడా రేవంత్ రెడ్డి అభ్యంతరం పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం బిఆర్ఎస్ కు లేఖ ఇచ్చింది..
ఈ విషయంపైన ఢిల్లీ హైకోర్టు లో రేవంత్ రెడ్డి కేసు నేమోదు చేశారు..
ఆ కేసు వాదనలు ఈ రోజు జరిగాయి .
************************************
హైదరాబాద్
డీజీపీ ఆఫిస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
కానిస్టేబుల్ నియామక దేహాదారుఢ్య ఈవెంట్స్ లో లాంగ్ జంప్ లెంగ్త్ పెంచడం పై నిరసన
3.8 మీటర్ల నుండి 4 మీటర్ల పెంచడం వల్ల చాలా మంది అనర్హులుగా తిరిగి వస్తున్నారంటు నిరసన
షాట్ పుట్ లోనూ పెంచిన లెంగ్త్ ను తగ్గించాలని డిమాండ్
కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు
***************************************
యాంకర్:సొంత కొడుకు భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తన మమపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో పిర్యాదు చేసిన కోడలు అతిఫాబేగం.హైద్రాబాద్,గోల్కొండా రిసాలబజార్ కు చెందిన ఖలిక్ హైమద్ తన కుమారుడు షోయబ్ కు తన బంధువుల అమ్మాయి అయిన అతిఫాబేగం ను ఇచ్చి పెళ్లి చేశాడు.పెళ్లి అయినప్పటి నుండి తన కోడలి పై మనసూపడ్డ మామా ఖలిక్ హైమద్ తరచుగా లాంగికంగా వేధింపులకు గురిచేస్తు..ఈ విషయం పై ఎవరికి చెప్పిన చంపుతానని వేధిస్తున్నాడని తన భర్తకు తెలిపి,స్థానికంగా ఉన్న గోల్కొండా పోలీసులకు పిర్యాదు చేసిన తన మామ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ చైర్మన్ కు బాధితారలు అతిఫా బేగం గోడు వెళ్లబోసుకుంది.తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని,తన భర్తను,తనను తరచుగా వేధిస్తు చంపుతానని బెదిరిస్తున్నాడని ,అతని నుండి తనకు తన భర్తకు ప్రాణారక్షణ కల్పించాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు వేడుకుంది. స్పందించిన కమిషన్ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నారు.
బైట్:అతిఫా బేగం(బాధితురాలు)
బైట్:శ్రీనాద్(న్యాయవాది)
***************************************
బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేక ప్రజలు రోడ్ల మీదకి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం
ఆర్యపూరం, లింగం పేట ,కొత్త రోడ్
డీఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా
ఎంత అరికట్టిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని
స్థానిక ప్రజల ఆవేదన
********************************