గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం, ఉచిత మెగా మెడికల్ క్యాంప్ తానా ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ ఆధ్వర్యంలో భారీస్థాయిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, , అతిథులుగా రావి వెంకటేశ్వరరావు, శవర్ల కుమార్ రాజ, రోటరీ క్లబ్ గుడివాడ సభ్యులు హాజరయ్యారు.
తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చిన తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ప్రతినిధులు సతీష్ వేమూరి, పురుషోత్తం గూడె, సునీల్ పంత్ర, శశాంక్ యార్లగడ్డ, ఉమా కటికి, జోగేశ్వర రావు పెద్దిబోయిన, ఠాగూర్ మలినేని, రాజా కసుకుర్తి, రావు మొవ్వా, నాగ పంచుమర్తి, రఘు ఎద్దులపల్లి, TNILIVE డైరక్టర్ కిలారు ముద్దుకృష్ణ, చెన్నూరి సుబ్బారావు తదితరులను శశికాంత్ వల్లేపల్లి వేదిక మీదకు ఆహ్వానించి సత్కరించారు.
55 మంది పాఠశాల విద్యార్థినులకు తానా చేయూత ద్వారా ఉపకారవేతనాలు, తానా ఆదరణ ద్వారా 25 కుట్టు మిషన్లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ బహూకరించారు. ఉచిత నేత్ర, క్యాన్సర్, చెవి-ముక్కు-గొంతు వైద్య శిబిరం నిర్వహించారు. శశికాంత్ తండ్రి సీతారామ్మోహనరావు జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ-రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్టుకు వైకుంఠ రథాన్ని బహూకరించారు. కామినేని శ్రీనివాస్ తానా సేవలను, శశికాంత్‌ను అభినందించారు. అంజయ్య చౌదరి తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో జరిగే సేవా కార్యక్రమాలు వివరించారు. యార్లగడ్డ వెంకటరమణ దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
వల్లేపల్లి శశికాంత్ సారధ్యంలో గుడివాడలో మెగా మెడికల్ క్యాంప్…ఉపకార వేతనాల పంపిణీ
Related tags :