Business

TNI.. వాణిజ్యం.. హుండాయ్ కొత్త కార్లు వచ్చేస్తున్నాయి

TNI.. వాణిజ్యం.. హుండాయ్ కొత్త కార్లు వచ్చేస్తున్నాయి

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) భారతీయ మార్కెట్లో రానున్న కొత్త సంవత్సరం (2023) జనవరిలో కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇవన్నీ కూడా 2023 లో జరిగే ‘ఆటో ఎక్స్‌పో’ లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ మార్కెట్లో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్ ఇండియా’ వచ్చే నెలలో తన అప్డేటెడ్ ‘ఆరా’ ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కాంపాక్ట్ సెడాన్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్పోర్టినెస్ డిజైన్ ఫిలాసఫీని పొందే అవకాశం ఉంటుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ 2023 హ్యుందాయ్ ఆరా తప్పకుండా అప్డేట్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా మరియు రియర్ ఎండ్ పొందే అవకాశం ఉంది.
అప్డేటెడ్ 2023 హ్యుందాయ్ ఆరా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందే అవకాశం ఉంది. అవి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్సన్స్ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది అప్డేటెడ్ ఇంటీయర్ ఫీచర్స్ కూడా పొందనుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఆరా.. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మరియు టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కంపెనీ యొక్క ‘గ్రాండ్ ఐ10 నియోస్’ కూడా కొత్త వెర్షన్ రూపంలో అడుగుపెట్టనుంది. ఇప్పటికీ ఈ కారు టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్ వంటి వాటితో పాటు ఎల్ఇడి డిఆర్ఎల్ లతో ఫ్రంట్ ఫాసియాను చూడవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో ఇంజిన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో CNG వెర్షన్ 68 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
2023 లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ మైక్రో ఎస్‌యువి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ తో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కూడా చాల వరకు ఆధునికంగా రూపొందించబడి ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ మైక్రో ఎస్‌యువి టాటా పంచ్ మైక్రో ఎస్‌యువికి సరైన ప్రత్యర్థిగా నిలుపడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
హ్యుందాయ్ కార్ల విడుదలపై మా అభిప్రాయం: దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ 2023 ఆరా, మైక్రో ఎస్‌యువి, 2023 గ్రాండ్ ఐ10 నియో వంటి వాటితో పాటు కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 కూడా త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.