తిరుమల…టిటిడి ఇఓ దర్మారెడ్డి ఇంట విషాదం
దర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందినట్లు ప్రకటించిన డాక్టర్లు
మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చంద్రమౌళి
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో యువతి సెల్ఫీ సూసైడ్ కలకలం
— ప్రియుడికి మరొకరితో నిశ్చితార్థం అయ్యిందని యువతి మనస్థాపం
— ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిపై దాడి చేసినట్లు ఆరోపణ
— మనస్థాపంతో
జాకెట్ పిన్నులు నీటిలో కలిపిమింగిన యువతి
— అనంతరం మణికట్టుపై బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నం
— యువతిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
🦠ఒమిక్రాన్ BF-7 లక్షణాలు
ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ BF-7 వేరియంట్ లక్షణాలుంటాయని నిపుణులు వెల్లడించారు.
👉🏻జ్వరం,ముక్కు కారడం
👉🏻ఎక్కువగా దగ్గు,గొంతు నొప్పి వినికిడి సమస్యలు
👉🏻ఛాతీలో నొప్పి రావడం
👉🏻వణుకు రావడం
👉🏻వాసన గుర్తించకపోవడం
XBB వేరియంట్
కింది సమాచారానికి శ్రద్ధ చూపుదాం:
COVID-Omicron XBB కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ విభిన్నమైనది, ప్రాణాంతకం మరియు సరిగ్గా గుర్తించడం సులభం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించమని సలహా ఇస్తున్నారు.
కొత్త వైరస్ COVID-Omicron XBB యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. దగ్గు ఉండదు.
2. జ్వరం లేదు.
వీటిలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి:
3. కీళ్ల నొప్పులు.
4. తలనొప్పి.
5. మెడలో నొప్పి.
6. ఎగువ వెన్నునొప్పి.
7. న్యుమోనియా.
8. సాధారణంగా ఆకలి ఉండదు.
COVID-Omicron XBB డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ఎక్కువ వైరస్ మరియు దాని కంటే ఎక్కువ మరణాల రేటును కలిగి ఉంది.
పరిస్థితి తీవ్ర తీవ్రతకు చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది మరియు కొన్నిసార్లు స్పష్టమైన లక్షణాలు ఉండవు.
మరింత జాగ్రత్తగా ఉందాం!
వైరస్ యొక్క ఈ జాతి నాసోఫారింజియల్ ప్రాంతంలో కనిపించదు మరియు సాపేక్షంగా తక్కువ వ్యవధిలో నేరుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.
Covid-Omicron XBBతో బాధపడుతున్న అనేక మంది రోగులు అఫెబ్రిల్ మరియు నొప్పి లేనివారుగా వర్గీకరించబడ్డారు, అయితే x- కిరణాలు తేలికపాటి ఛాతీ న్యుమోనియాను చూపించాయి.
కోవిడ్-ఒమిక్రాన్ XBBకి నాసికా శుభ్రముపరచు పరీక్షలు తరచుగా ప్రతికూలంగా ఉంటాయి మరియు తప్పుడు ప్రతికూల నాసోఫారింజియల్ పరీక్షల కేసులు పెరుగుతున్నాయి.
అంటే వైరస్ సమాజంలో వ్యాప్తి చెందుతుంది మరియు నేరుగా ఊపిరితిత్తులకు సోకుతుంది, ఇది వైరల్ న్యుమోనియాకు కారణమవుతుంది, ఇది తీవ్రమైన శ్వాసకోశ బాధను కలిగిస్తుంది.
Covid-Omicron XBB చాలా అంటువ్యాధి, అత్యంత వైరస్ మరియు ప్రాణాంతకమైనదిగా ఎందుకు మారిందని ఇది వివరిస్తుంది.
జాగ్రత్త, రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి, బహిరంగ ప్రదేశాల్లో కూడా 1.5 మీటర్ల దూరం ఉంచండి, డబుల్ లేయర్ మాస్క్ ధరించండి, తగిన మాస్క్ ధరించండి, తరచుగా చేతులు కడుక్కోండి, ప్రతి ఒక్కరూ లక్షణరహితంగా ఉన్నప్పటికీ (దగ్గు లేదా తుమ్ములు లేవు).
Covid-Omicron XBB యొక్క ఈ తరంగం కోవిడ్-19 యొక్క మొదటి తరంగం కంటే ఘోరమైనది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు కరోనావైరస్కు వ్యతిరేకంగా అనేక పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
విజయవాడ పాత ప్రభుత్వ వైద్యశాలలో అమానవీయం నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీని పట్టించుకోని సిబ్బంది స్ట్రెచర్ కోసం ప్రాధేయపడినా నిర్లక్ష్యం చూపారని బంధువుల ఆరోపణ రూల్స్ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్న బంధువులు సిబ్బంది ముందుకు రాకపోవడంతో నేలపైనే గర్భిణీ ప్రసవం ప్రసవం అనంతరం వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ మహిళ బాలింత వాంతులు చేసుకునే సమయంలో జారి కిందపడిన శిశువు శిశువు తల నేలకు తగిలి బొడ్డు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం.
హాస్పటల్ బయట డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా సిబ్బందిపై సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం. హాస్పటల్లోకి మీడియా అనుమతి లేదంటున్న సెక్యూరిటీ సిబ్బంది. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న వైద్యులు. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు నిరంతరంగా జరుగుతున్నాయి అంటున్న బంధువులు.
హాస్పటల్లో ఇన్ని జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం ఆగ్రహం చేస్తున్న బంధువులు.
ఎన్టీఆర్ జిల్లా :
తిరువూరు నుండి గంపలగూడెం వెళ్లే ప్రధాన రహదారిలో పీటి కొత్తూరు సమీపంలో ప్రమాదవశాత్తు రోడ్డుపై అడ్డంగా బోల్తా కొట్టిన టిప్పర్ లారీ..
డ్రైవర్, క్లీనర్ లు సురక్షితం, ట్రాఫిక్కు ఏర్పడిన అంతరాయం..
విజయవాడ
PvP మాల్ మీద నుంచి దూకి యువకుడి సూసైడ్
మాల్ ఐదో అంతస్తు నుంచి కిందకి దూకి మృతి
నిన్న అర్థరాత్రి ఘటన, ఆలస్యంగా వెలుగులోకి
మృతుడు మాల్ బార్బీ క్యూ లో పనిచేసే ఒరిస్సాకి చెందిన దాస్ గా గుర్తింపు
ఘటనకు ముందు బార్బీ క్యూ సహా ఉద్యోగి తో వివాదం
దాస్ ని బార్బీ క్యూ యజమాని మందలించినట్టు సమాచారం
కాసేపటికే 11.30 గంటల సమయంలో మాల్ ఐదో అంతస్తు నుంచి పడి చనిపోయిన దాస్
సూసైడ్ చేసుకున్నాడా, ఎవరైనా కిందకు తోసేశారా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు
మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
రాజా రెడ్డి నగర్ లబ్ధిదారులకు న్యాయం చేకురెందుకు సిట్ ఏర్పాటు చేయండి.
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు.
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు స్థానిక రాజా రెడ్డి నగర్ లబ్ధిదారులకు న్యాయం చేకూరెందుకూ సిట్ ( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ మోహన్ దాస్ గారికి అన్ని ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత పిసిసి గిడుగు రుద్రరాజు గారు తదితరులు పత్తికొండ లో అట్టహాసంగా ప్రారంభించిన రాజా రెడ్డి నగర్ ఇప్పుడు ఏమైనట్టు, లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ళులు ఎక్కడా, వారి పట్టా లిస్ట్ ఏమైనట్టు..?? RDO, MRO ఆఫీసులలో ఫైల్ మాయం అయ్యాయి, వారికి ఇళ్ళు కేటాయిస్తూ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫేస్ త్రీ నుండి నిధులు కూడా మంజూరు అయ్యాయి మరి వాటి సంగతి ఏమిటి, ఆ ఇళ్ళులు ఇపుడు కాకులు ఎత్తుకుపోయాయ లేక అధికార పార్టీ నాయకులు ఎత్తుకెళ్లారా అని ప్రశ్నించారు. ఆర్టీఐ ద్వారా మరియు హౌసింగ్ కార్పొరేషన్ కు విన్నవిస్తే న్యాయం జరుగుతుంది అని ఆశించాము కానీ ఇప్పటి వరకు జరగలేదు. లబ్ధిదారులకు సహాయం చేయండి అని హౌసింగ్ కార్పొరేషన్ వారు డైరెక్షన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఫలితం లేదు అని అన్నారు. ఇది పూర్తిగా చట్ట ప్రకారం ఉల్లంఘన అని సెక్షన్ 201, పబ్లిక్ రికార్డ్స్ ఆక్ట్ 1993, రూల్స్ 97 ప్రకారం ఇది నేరం అని, మరి నిరుపేదలకు న్యాయం జరిగేది ఎలా అని స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో ఆర్డీఓ మోహన్ దాస్ గారిని ప్రశ్నించడం జరిగింది. లబ్ధిదారులకు న్యాయం చేకూరేందుకు RDO గారి అధ్యక్షతన ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వేసి రీసర్వే చేయించి, OTS ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలి అని, లబ్ధిదారులకు న్యాయం చేయండి అని విన్నవించడం జరిగింది. ఒకవేళ అధికార పార్టీ వారు కదా అని వారికి వత్తాసు పలికి వదిలేస్తే ఉన్న ఆధారాలతో కోర్ట్ ను ఆశ్రయిస్తామని, కేసులు నమోదు చేస్తామని, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తాం అని తెలియజేయడం జరిగింది.
క్రాంతి నాయుడు బోయ
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.
భారత్‌లోకీ ఒమిక్రాన్ bf-7 వేరియంట్ ఎంట్రీ
చైనా ను వణికిస్తుంది ఇదే!!!
ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్!!!
ఇండియాలోకి ఒమిక్రాన్ bf-7 వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. చైనాలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులకు కారణమైంది ఈ వేరియంటే. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్ సీక్వెనింగ్‌లో వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు భారత్‌లో 4 ఒమిక్రాన్ bf-7 వేరియంట్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు ఆదేశించారు.
కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది. కరోనా ముప్పు ఇంకా పోలేదని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్‌లను ధరించాలని కేంద్రం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్ కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టులో టెస్ట్‌లను కంపల్సరీ చేశారు.
చైనాలో అల్లకల్లోలం8
ఒమిక్రాన్ bf-7 వేరియంట్ కారణంగానే చైనాలో .. కరోనా పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అధికార యంత్రాగం చేతులు ఎత్తేయడంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అంబులెన్స్‌ల కోసం వేలాది ఫోన్ కాల్స్ రావడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఆఖరికి కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ bf.7 తోనే చైనాలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. బీజింగ్‌తో సహా పలు నగరాలలోని ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనాతో చనిపోయిన వాళ్ల శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. కరోనాతో రానున్న రోజుల్లో లక్షలాదిమంది చనిపోయే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 60 శాతం జనాభాకు కరోనా సంక్రమించే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి