ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
bmo harris bank customer service
శోభరాజ్ వయసును దృష్టిలో ఉంచుకుని అక్కడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విడుదల చేసిన 15 రోజుల్లోగా ఆయన ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.
ప్రస్తుతం శోభరాజ్‌కు 78 ఏళ్లు. గుండె జబ్బుతో బాధపడుతున్నారు.
1975లో నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన కేసులో శోభరాజ్ 2003 నుంచి నేపాల్‌లో జైలులో ఉన్నారు.
1972, 1982 మధ్యలో భారత్, థాయ్‌లాండ్, నేపాల్, టర్కీ, ఇరాన్‌లలో 20కి పైగా హత్యలు చేశారని.. బాధితులకు మత్తుమందు ఇవ్వడం, గొంతు కోయడం, కొట్టడం లేదా తగలబెట్టడం వంటి చర్యల ద్వారా హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
భారత్, థాయ్‌లాండ్ దేశాలకు వచ్చే యువ పర్యటకులను టార్గెట్ చేసేవారు.
‘ది సర్పెంట్’, ‘బికినీ కిల్లర్’ వంటి మారుపేర్లతో ప్రసిద్ధి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలోని సైగాన్‌లో జన్మించారు.
తల్లి వియత్నాం పౌరురాలు, తండ్రి భారతీయుడు.
తండ్రి శోభరాజ్‌ను చేరదీసేందుకు నిరాకరించారు.
అదే సమయంలో ఫ్రాన్స్ వియత్నాంను ఆక్రమించింది. ఫ్రెంచ్ కాలనీలో జన్మించిన శోభరాజ్‌కు ఫ్రెంచ్ పౌరసత్వం వచ్చింది.
నేపాల్‌లో హత్యానేరం రుజువు కావడానికి ముందు, ఫ్రెంచ్ టూరిస్టులపై విషప్రయోగం చేసిన కేసులో దాదాపు 20 ఏళ్లపాటు భారత్‌లో జైలు జీవితం గడిపారు.
ఆ సమయంలో జైలు గార్డులకు మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
తనను థాయ్‌లాండ్‌కు అప్పగించకుండా తప్పించుకోవడానికి అలా చేశానని ఆ తరువాత శోభరాజ్ చెప్పారు.
ఆ సమయంలో అయిదు హత్యా నేరాలలో థాయ్‌లాండ్ ప్రభుత్వం శోభరాజ్‌ను పట్టుకోవడం కోసం చూస్తోంది.
శోభరాజ్ భారత్ నుంచి మాత్రమే కాకుండా అఫ్గానిస్తాన్, గ్రీస్, ఇరాన్‌లోని జైళ్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారని చెబుతారు.
చార్లెస్ శోభరాజ్: ఈ ‘బికినీ కిల్లర్’ నేపాల్ జైలు నుంచి విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వగలిగారు
“మా నాన్నే హంతకుడు.. ఎంతమందిని చంపాడో లెక్కలేదు”
నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి..
ప్రారంభంలో శోభరాజ్ ఫ్రాన్స్‌లో చిన్న చితకా నేరాలకు పాల్పడేవారని చెబుతారు. 1963లో ఆసియాకు తరలివెళ్లిన దగ్గర నుంచి సీరియల్ కిల్లర్‌గా మారారు.
శోభరాజ్ నేరాలు చేసే పద్ధతి ఎప్పుడూ ఒకేలా ఉండేదని విశ్లేషకులు చెబుతారు.
ఫ్రెంచ్, ఇంగ్లిష్ మాట్లాడే పర్యటకులతో స్నేహం చేసేవారు.
వారికి డ్రగ్స్ ఇచ్చి, వారి సొమ్ము దోచుకుని, ఆపై హత్య చేసేవారు.
హత్య కేసుల్లో జైలుకు వెళ్లడం, అక్కడి నుంచి తప్పించుకోవడం.. ఇదే శోభరాజ్ పద్ధతి.
భారతదేశంలో రెండుసార్లు జైలు నుండి తప్పించుకున్నారు.
ఒకసారి తిహార్ లాంటి హై సెక్యూరిటీ జైలు నుంచి కూడా తప్పించుకున్నారు.
నైరోబీ బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం… పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు
ఆడవాళ్ల మాంసాన్ని వేయించుకు తినాలని కోరుకున్న ఆ వ్యక్తిని కోర్టు ఎందుకు విడిచిపెట్టింది?
తిహార్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు?
1976లో శోభరాజ్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. తిహార్ జైల్లో ఉంచారు. కానీ, 1986లో జైలు నుంచి తప్పించుకున్నారు.
ఆ రోజు జైలులో తన పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశారు. ఖైదీలతో పాటు గార్డులను కూడా పార్టీకి పిలిచారు. బిస్కట్లు, ద్రాక్ష పండ్లలో నిద్రమాత్రలు కలిపారు.
కొద్దిసేపటికే, శోభరాజ్, ఆయనతో పాటు జైలు నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న మరో నలుగురు ఖైదీలు మినహా అందరూ స్పృహకోల్పోయారు.
శోభరాజ్ జైలు నుంచి బయటపడతానని ఎంత విశ్వాసంతో ఉన్నారంటే, జైలు గేటు దగ్గర ఫొటో కూడా తీయించుకున్నారని భారతీయ వార్తాపత్రికలలో రిపోర్టులు వచ్చాయి.
తిహార్ జైలు నుంచి కావాలనే తప్పించుకున్నారని, మళ్లీ పట్టుబడి, తిరిగి శిక్ష వేయించుకోడానికే అలా చేశారని విశ్లేషకులు అంటారు. తద్వారా థాయ్‌లాండ్‌లో శిక్ష తప్పించుకోవచ్చు. అక్కడ ఆయనపై అయిదు హత్యానేరాలు నమోదయ్యాయి. మరణశిక్ష దాదాపు ఖాయమైంది.
భారత్ జైలు నుంచి తప్పించుకుని, మళ్లీ దొరికితే ఇక్కడే జైల్లో వేస్తారు. థాయ్‌లాండ్‌లో శిక్ష తప్పించుకోవచ్చు. ఇదీ ఆయన ప్లాన్.
1997లో శోభరాజ్ విడుదలయ్యే సమయానికి, బ్యాంకాక్‌లో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి గడువు ముగిసింది.
దాంతో, అదే సంవత్సరం భారత్ ఆయన్ను ఫ్రాన్స్‌కు అప్పగించింది.
నేపాల్‌లో అరెస్ట్..
చార్లెస్ శోభరాజ్ 2003లో మరోసారి నేపాల్‌కు తిరిగి వెళ్లారు.
పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలిసినా నిర్భయంగా వెళ్లారు. మీడియాతో కూడా మాట్లాడారు.
నేపాల్ రాజధాని కఠ్మాండూలోని ఓ క్యాసినోలో ఆయన్ను పట్టుకున్నారు. సుమారు 28 ఏళ్ల కిందటి కేసును తిరగదోడారు.
నకిలీ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించారని, ఒక కెనడియన్ పౌరుడిని, అమెరికన్ మహిళను హత్య చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు.
అయితే, శోభరాజ్ ఈ ఆరోపణలను ఖండించారు. పోలీసులు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేరం రుజువుకావడంతో 2004లో జీవిత ఖైదు పడింది.
గత ఏడాది ఏప్రిల్‌లో, చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలు నుంచి విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో మళ్లీ తెరపైకి వచ్చారు.
జైలు ఖైదీ మీడియాతో ఎలా మాట్లాడారన్న సందేహాలు తలెత్తాయి.
ఈ ఇంటర్వ్యూ ఆధారంగా, శోభరాజ్ జైలు శిక్ష, ఆయన భవిష్యత్తు ప్రణాళికల గురించి రెండు బ్రిటిష్ పత్రికలలో కథనాలు వచ్చాయి.