పుట్టినప్పటి నుండి సొంత గ్రామానికి రాని అవిభక్త కవలలు ఈ రోజు మొట్టమొదటి సారిగా తమ సొంత గ్రామంలో ఇంటిలో తోలి అడుగు పెట్టిన వీణా-వాణి గత 16,17 సంవత్సరాల వ్యవధిలో ఒక్కసారి కూడా తన సొంత ఇంటికి రాని వీణా-వాణీ ఈరోజు రాగానే గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే గ్రామ ప్రజలు విణా-వాణీ నీ చూడగానే అయ్యో బిడ్డలు ఎంత నరకం అనుభవిస్తున్నారో అనీ బాధ పడుతున్నారు వీరి యోగక్షేమాలు చూసే వారికి సంబంధించిన స్టాఫ్ తో కలిసి గ్రామం బీరిశెట్టిగూడెం, మండలం దంతాలపల్లి, జిల్లా మహబూబాబాద్ లోని తోలి సారిగా తమ సొంత ఇంటికి వచ్చిన వీణా-వాణి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లితండ్రులు మారగాని లక్ష్మి-మురళికీ జన్మించిన రెండవ సంతానం విణా-వాణి, వీరికి అక్కా, చెల్లి కూడా ఉన్నారు వీరందరితో,బందువులతో ఈ రోజు తమ ఇంటిలో వాళ్ళతో ఆనందంగా గడిపేందుకు వచ్చామని తెలియచేస్తున్నారు. గత ఇంటర్ పరీక్షలో వీణా-వాణి పస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు,ఇప్పుడు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారని తెలియజేసారు.