💥ఆటోను ఢీకొన్న లారీ.. ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ దుర్మరణం
సూర్యాపేట: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు సమీపంలోని బేతవోలు ఎక్స్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలిక పాఠశాలలో ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్‌గా గీత(36) విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా బుధవారం స్టడీ అవర్ ఉండడంతో రాత్రి 9 గంటల వరకు పాఠశాలనే ఉండి ఆ తర్వాత తను నివాసం ఉంటున్న కోదాడకు మరో ఉపాధ్యాయురాలితో కలిసి ఆటోలో బయల్దేరారు. ఈ క్రమంలో చిలుకూరు గ్రామ శివారుకు ఆటో చేరుకున్న సమయంలో కోదాడ నుండి ఎదురుగా వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో వెనక సీటులో కూర్చున్న గీత తలకు బలమైన గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. గీతకు భర్త బాబురావు, కూతురు సీక్రీ చౌదరి (10), కుమారుడు అభినవ్ చౌదరి (1) ఉన్నారు. గీత మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బీసీ గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. నిన్నటి వరకు తమతో కలివిడిగా ఉన్న గీత ఒక్క సారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు.
************************
కదం తొక్కిన విద్యార్థి పరిషత్🚩
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.పోలీసులు అక్రమంగా అడ్డుకోవాలని ప్రయత్నించిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెనుతిరుగలేది .ఏదైతే పెండింగ్లో ఉన్న 2200కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కాలేజ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు శ్రావణ గారు మాట్లాడుతూ ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని అదే విధంగా JL&DL పోస్టులను భర్తీ చేయాలని అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని అదే విధంగా విద్యార్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని యెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టుతాం అని హెచ్చరించారు అదే విధంగా ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి హర్ష మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్ధుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని అదే విధంగా 300 గురుకుల నూతన భావనలను నిర్మించాలని అదే విధంగా ప్రతి నిర్ధిగ్యోగికి 3116/- రూపాయిల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయాలి అని అదే విధంగా ప్రభుత్వ హాస్టల్లో జరిగే ఫుడ్ పాయిజన్ నియంత్రించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి హెచ్చరించారు అదే విధంగా ఈ కార్యకరమాని ఉదేశించి టౌన్ సెకరటేరి సురేష్,టౌన్ SFD కన్వీనర్ అజయ్ మరియు కళాశాల వైస్ ప్రెసిడెంట్ శివరాజ్ హెచ్చరించారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తన అహంకారపు, మొండి వైకరిని వీడి విద్యార్ధుల సమ్యసలను పరిష్కారించలి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు శ్రావణ్ గారు,కళాశాల కార్యదర్శి హర్ష,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కుమార్,టౌన్ సెక్రెటరీ సురేష్,వైస్ ప్రెసిడెంట్ సాయినాథ్,శివరాజ్,నరసింహ, SFD కన్వీనర్ అజయ్,శివాజీ,అనూహ్య,జాయింట్ సెక్రటరీ పవన్,మనోజ్, టౌన్ జాయింట్ సెక్రటరీ మహేష్,టౌన్ SFD కన్వీనర్ చంద్రకాంత్, వైస్ ప్రెసిడెంట్ అంజి,కళాశాల గర్ల్స్ కోఆర్డినేటర్ ఇందు,దివ్య,పూజిత, సాయి తరుణి,రోహిణి,గాయత్రి మరియు పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్తలు మిత్రులు పాల్గొన్నారు
******************************
Poaching case accused Ramachandrabharathi @ sathish sharma was arrested by Banjarahills police in Fake Passport case…
*************************
అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచడం, పాసింజర్ లిప్టులు ప్రారంభించడం కాదు– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేదు
చరిత్రలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది.
హైదరాబాద్ నగర అభివద్దిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళ్లుండి చూడలేని పరిస్థితిలో ఉన్నారు.
సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తరబిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరానికి కేంద్రం ఇచ్చిన అదనపు నయాపైసా సహాయం ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పాలి.
హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ బిజెపికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేనే లేదన్న కేటీఆర్.
కేంద్ర మంత్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సైతం చూడలేని పరిస్థితిలో కిషన్రెడ్డి ఉన్నారు.
నగర భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న కేటీఆర్
హైదరాబాద్ నగర అభివద్దిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళ్లుండి చూడలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నార. నగరం నలుమూలలా అద్భుతంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఒర్వలేక, అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తరబిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నలువైపులా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుంటే కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.హైదరబాద్ నగరానికి ఒక్కపైసా అదనంగా తేలేని కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విస్తృతమై అభివృద్ధిలో కేంద్రం వాట ఎంతో ప్రజలకు వివరిస్తే మంచిదని సూచించారు. అభివృద్ధి అంటే రైల్వే స్టేషన్లో మూడు లిప్టులను ప్రారంభించడం కాదని చురకలంటించారు. వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు తీసుకురాలేని నిస్సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించుకుపోయిన ప్రధానమంత్రిని ఇదేందని అడగలేని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్ర మోడీ పాట పాడుతున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం సికిందరాబాద్ లో కేంద్రప్రభుత్వ నిధులతో ఏం డెవలప్ మెంట్ చేసిండో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని దాని ఫలాలను నగర ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క ప్రాంతానికో ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు యస్అర్డీపీ, యస్ఎన్డీపీ, సిఅర్ఏమ్ పి కార్యక్రమాలు, వైకుంఠ దామాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలే నిదర్శనం అన్నారు.
అభివృద్ధిలో రోజురోజు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ. 5660.57 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామని, అందులో ఇప్పటి వరకు 32 పనులు పూర్తయ్యాయి పూర్తి అయ్యాయన్న కేటీఆర్, ఈ సంవత్సరంలోనే 11 పనులను పూర్తి చేసి అందుబాటు లోకి తెచ్చామన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా ఉండడానికి 985.45 కోట్ల వ్యయంతో యస్ ఎన్ డి పి ద్వారా నగరం చుట్టు ఉన్న మున్సిపాలిటీల్లో 56 పనులు చేపట్టగా జిహెచ్ఎంసీ పరిధిలో 35 పనులను 735 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. పికెట్ నాలాపై నిర్మించిన బ్రిడ్జితో అనేక కాలనీలకు వరద ముప్పు తప్పిందన్నారు. ఇలా ఎల్బీనగర్ జోన్ లో 6628 పనులు, చార్మినార్ జోన్ లో 12,426 , ఖైరతాబాద్ లో 7829 , శేర్లింగంపల్లి జోన్ లో 4556, కూకట్పల్లి జూన్లో 5,159, సికింద్రాబాద్ జోన్ లో 6517 పనులు చేపట్టామన్నారు. ఇలా చెప్పుకుంటే పొతే తాము చేసిన అభివృద్ధి పనుల జాబితా అంతులేనిదని, తమ ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.
భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో డెవలప్ చేస్తున్నామన్న కేటీఆర్, సిటీ విస్తరణంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక,ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నానమని కేటీఆర్ చెప్పారు. ప్యాసింజర్ లిఫ్ట్ లను ప్రారంభించడం, కుర్ కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్ కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేనే లేదన్నారు కేటీఆర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి తన సొంత పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా అవగాహన లేదని కేటీఆర్ అన్నారు.ఇందిర పార్కు నుండి వి యస్ టి మెయిన్ రోడ్డు వరకు, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు జంక్షన్ నుండి అర్ టి సి క్రాస్ రోడ్డు భాఘ్ లింగం పల్లి జంక్షన్ ఫేస్ 1 మరియు 2 లెవెల్ మూడు లేన్ల బైడైరెక్షనల్ ఇండిపెండెంట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను రామ్ నగర్ రోడ్డు నుండి వి యస్ టి మెయిన్ రోడ్డు జంక్షన్ మీదుగా బాగ్ లింగంపల్లి వరకు 423 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులు జూన్ 2023 వరకు పూర్తి చేయనున్నట్లు కెటియార్ తెలిపారు. భారీగా అన్ని జోన్లతో ముఖ్యంగా పాత యంసియచ్ పరిధిలో సిఅర్ యంపి కార్యక్రమం ద్వారా రోడ్ల నిర్వహణ నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం హైదరాబాద్ లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్ పెట్ ఫ్లై ఓవర్ పనులు మూడేండ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నా అస్సలు పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఫ్లై ఓవర్ పనులు స్లోగా సాగడంతో రోడ్ల మీద ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా ఏ మాత్రం చలించని కిషన్ రెడ్డి, తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పై నిందలు వేయడం అజ్ఝానం, అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు కేటీఆర్.
భవిష్యత్తుకు అనుగుణంగా నగరాన్ని నాలుగు దిక్కుల్లో డెవలప్ చేస్తున్నామన్న కేటీఆర్, సిటీ విస్తరణంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక,ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగిస్తున్నానమని కేటీఆర్ చెప్పారు. ప్యాసింజర్ లిఫ్ట్ లను ప్రారంభించడం, కుర్ కురే ప్యాకెట్లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పనికిమాలిన మాటలు బంద్ చేసి హైదరాబాద్ కు నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనీ మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తమను విమర్శించే అర్హత లేనే లేదన్నారు కేటీఆర్.
***************************************
ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం..
ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం
వైద్య ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది
కరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష
కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్ సన్నద్ధతపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జూమ్ ద్వారా నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, టీవీవిపి కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధత పై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్య మంత్రి గారి దిశా నిర్ధేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనా ను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు , మందులు , ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
(***********************************
దొంగ పాస్ పోర్ట్ కేసులో రామచంద్ర భారతి అరెస్టు..
14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.
చంచల్ గూడా జైలుకు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు..
************************************