NRI-NRT

5 వ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలు ప్రారంభం.

5 వ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలు ప్రారంభం.

8
1
2
4
3
విజయవాడ : 5 వ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలను శుక్రవారం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వేదిక పై పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్,జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మన బడి వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్, తానా నేతలు ప్రసాద్ పాల్గొన్నారు. దాదాపు 1500 మంది తెలుగు రచయితలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సాయంత్రం జరిగిన తెలుగు రచయితల మహాసభకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మాతృభాషను మరిచిపోకూడదని భాషను మర్చిపోతే తెలుగుజాతి మనుగడ కష్టమవుతుందని ఉపాధ్యాయులు కవులు రచయితలు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ప్రముఖ అవగాహన పండితులు గరికపాటి నరసింహారావు చేసిన ప్రసంగం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది మండలి బుద్ధ ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు సినీ రచయిత భువనచంద్ర వీణ పోనీ తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తదితరులు ప్రసంగించారు ఉదయం జరిగిన సభలో సిలికాన్ ఆంధ్ర చైర్మన్ కూచిభట్ల ఆనంద్ నూతనంగా రూపొందిస్తున్న కోటి మాటల కోట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
5
6
7