Politics

ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్య నాయుడు ఇంట్రేస్టింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్య నాయుడు ఇంట్రేస్టింగ్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కాగా, వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్‌ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ భోళా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో సైలెంట్‌ విప్లవాన్ని తెచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు అంటూ కామెంట్స్‌ చేశారు.