🎻🌹🙏కాశీయాత్ర – కాలభైరవుడు
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸కాశీయాత్రకు కాలభైరవుని అనుమతి కావలి. అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి., లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు.
🌿అందుచేత ముందు కాలభైరవుని గురించి
తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటివాడు. అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు. సాధారణముగా అందరు కాశీలో శివుడిని దర్శించుకొని వస్తారు.
🌸అలాకాకుండా కాశీలోని కాలభైరవ ఆలయము, అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ యాత్ర పరి పూర్ణమవుతుంది.
🌿త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న సందేహము వారికి వచ్చింది. సందేహ నివృత్తి కోసము వేదాలను ఆశ్రయిస్తే వేదాలు మహేశ్వరుడే గొప్ప వాడని తేల్చి చెప్పాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఈ విషయాన్ని తేలికగా తీసుకొని మహేశ్వరుడిని అవహేళన చేయసాగారు.
🌸ఉగ్రుడైన మహేశ్వరుడు ఉగ్రస్వరూపుడైన కాలభైరవుని సృష్టించాడు. కాలభైరవుని ఉగ్రరూపానికి పరిస్థితిని గమనించిన విష్ణువు మహేశ్వరుని ఆధిపత్యానికి అంగీకరించాడు.
కానీ బ్రహ్మ తన ధోరణిని మార్చుకోక మహేశ్వరుడిని హేళన చేయసాగాడు.
🌿అందుచేత కాలభైరవుడు బ్రహ్మకు ఉన్న ఐదు తలలో ఒక తలను నరికేశాడు. ఆ తల కాలభైరవుడు చేతికి అంటుకుని ఊడి రాలేదు. అప్పుడు కాలభైరవుడు మహేశ్వరుడిని పరిష్కారము కొరకు ప్రార్ధిస్తే., మహేశ్వరుడు అన్ని పుణ్యక్షేత్రాలను, నదులను దర్శించమని చెప్పాడు.
🌸ఆ క్రమములో కాల భైరవుడు కాశీ నగరానికి వచ్చినప్పుడు బ్రహ్మ శిరస్సు ఊడిపడుతుంది. అప్పుడు శివుడు కాలభైరవుడిని కాశీ నగరంలోనే ఉండి నగరాన్ని సంరక్షిస్తూ ఉండమని ఆదేశిస్తాడు.
🌿కాలభైరవుని విగ్రహము మానవాకృతిలో ఉండి మానవ కపాలాల హారాన్ని మెడలో ధరించి కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు. కాల అనే మాటకు అర్ధము విధి లేదా మృత్యువు అంటే మృత్యువు కూడా కాలభైరవునికి భయపడుతుంది.
🌸ఈ కాలభైరవుని ఆలయము 17వ శతాబ్దములో నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ విధముగా కాశీలో కాలభైరవ
ప్రతిష జరిగింది
🌿కాశీ ఖండములోని 72 వ అధ్యాయములో చెప్పినట్లుగా దుర్గామాత అసుర సంహారము చేసినాక, దుష్ట శక్తుల నుండి కాశీ నగరాన్ని రక్షించటానికి కాశీలోని వివిధ ప్రదేశాలలో ఎనిమిది భైరవ మూర్తులను ప్రతిష్టించింది.
🌸వీరినే అష్ట భైరవులు అంటారు. వీటిని చూడాలి అంటే స్థానికంగా ఉండే వారి సహాయము అవసరము ఈ అష్ట భైరవ దేవాలయాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.
🌿1. భీషణ భైరవ్:- ఈ భైరవుడినే భూత్ భైరవ్ అని కూడా అంటారు ఈ దేవాలయము జెస్ట్ శ్వర్ కు దగ్గరగా ఉంటుంది.
🌸2. సంహార భైరవ్:-కాశీ ఖండము 69 వ అధ్యాయములో సంహార భైరవ్ ప్రస్తావన ఉంది. సంహార భైరవ్ ,భైరవక్షేత్రము నుండి వచ్చినట్లు ఆయనను ప్రార్ధిస్తే పాపలు హరిస్తాయని భక్తుల నమ్మకము.
🌿ఈ మందిరము గాయ్ ఘాట్ లో గల పఠాన్ దర్వాజా కు దగ్గరలో ఉంటుంది. అంటే కాశీకి ఉత్తరాన ఉంటుంది.
🌸3. ఉన్మత్త భైరవ్:- ఈ మందిరము పంచ క్రోసి యాత్ర మార్గములో దియోరా గ్రామములో అంటే కాశీకి 10 కి మీ ల దూరములో ఉంటుంది.
🌿4. క్రోధన్ భైరవ్:- ఈయనను అది భైరవ్ అని కూడా అంటారు.బతుకు భైరవ్ మందిర ప్రాంతములో ఉంటుంది ఈ మందిరములో రాహు శాంతి కాల సర్ప దోష నివారణ కోసము భక్తులు పూజలు చేయించుకుంటారు.
🌸5. కపాల భైరవ్ లేదా లాట్ భైరవ్ :-ఈ మందిరము కాశీకి ఈశాన్యముగా అలాల్పూర్ గ్రామములో ఉంటుంది ఈ మందిరము ఆనుకొనే మసీదు ఉంటుంది.
🌿ఈ ప్రాంతము వివాదాస్పద ప్రాంతమే. ఈ మందిరములోని భైరవ మూర్తి విగ్రహానికి పైన ఆచ్చాదన ఏమి ఉండదు. ఈ మందిరానికి ఎదురుగా లాట్ సరోవర్(కపాల విమోచన తీర్ధము) ఉంటుంది.
🌸6. అసితాంగ భైరవ్ :- వృద్ద కాళేశ్వర్ లో మహా మృత్యుంజయ గుడికి దగ్గరలో ఈ మందిరము ఉంటుంది.
🌿7. చాంద్ భైరవ్:- దుర్గ కుండ్ ప్రాంతములోని దుర్గ దేవి మందిరానికి దగ్గరలో ఈ మందిరము ఉంటుంది.
🌸8. రురు భైరవ్ :- రురు భైరవ్ ను ఆనంద్ భైరవ్ అని కూడా పిలుస్తారు. ఈ మందిరము హనుమాన్ ఘాట్ కు దగ్గరలో ఉంటుంది. రురు భైరవ్ మందిరానికి దగ్గరలోనే హనుమాన్ మందిరము,హరిశ్చంద్ర ఘాట్ ఉంటాయి.
🌿మన దేశములో కాశీలోని కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఉజ్జయినిలో కాలభైరవ మందిరము ఇక్కడ కాలభైరవునికి భక్తులు సారాయిని దేవుడికి నైవేద్యములో ఉంచి భక్తులు తీసుకుంటారు.
🌸కర్ణాటక లోని కాలభైరెవేశ్వర ఆలయము, తమిళనాడులోని కాలభైరవ ఆలయము ఓడిశాలోని అజై కాపాడ భైరవ్ దేవాలయము మొదలైనవి..స్వస్తి..🚩🌞🙏🌹🎻