DailyDose

TNI నేటి నేర వార్తలు. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు.

TNI నేటి నేర వార్తలు. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు.

అర్థరాత్రి ఒంటిగంట వరకూ మద్యం విక్రయాలు..

తెలంగాణలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా రాత్రి ఒంటిగంట వరకూ మద్యం విక్రయాలు…_

విక్రయానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్._..
**********************

సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి పర్యటనలో పోలీస్ ఓవర్ ఏక్షన్

గన్నవరం విమానాశ్రయం లో సి.ఐ సత్యనారాయన ఓవర్ఏక్షన్

మీడియా ను సహా బయటకు తోసేసిన గన్నవరం సి.ఐ సత్యనారాయణ

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయమూర్తులను కూడా అడ్డగించిన గన్నవరం సీఐ సత్యనారాయణ

భారత ప్రధాన న్యాయ మూర్తులను కనీసం కలవనివ్వలేదని పోలీసులపై విమర్శలు గుప్పించిన విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు
****************************
b3440bef-afaf-46cd-b04f-0ec5c1c94711
upload images fast

విదేశాల నుంచి భారత్ వచ్చిన 39 మందికి కరోనా పాజిటివ్

పలు దేశాల్లో మరోసారి విజృంభిస్తున్న కరోనా
భారత్ లో అప్రమత్తత
ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు
రెండ్రోజుల్లో 6 వేల మందికి కరోనా టెస్టులు

వివిధ దేశాల్లో కరోనా తీవ్ర రూపు దాల్చుతున్న నేపథ్యంలో భారత్ లోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో విదేశాల నుంచి భారత్ వచ్చిన 6 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చేవారిని ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే భారత్ లోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది.

కాగా, ప్రస్తుత పరిస్థితిని కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 40 రోజులు కీలకమని, జనవరి రెండో వారానికి భారత్ లో కరోనా కేసులు వెల్లువెత్తే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

****************************