ప్రస్తుతం హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో ఆధునిక హైబ్రిడ్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. మనం ఈ కథనంలో ఈ సంవత్సరం (2022) భారతీయ విఫణిలో విడుదలైన హైబ్రిడ్ కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ:
హోండా కంపెనీ ఈ సంవత్సరం తన ‘సిటీ ఇ-హెచ్‌ఈవీ’ హైబ్రిడ్ కారుని విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ కొత్త హైబ్రిడ్ వెర్షన్ ధర రూ.19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ దాని ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని దీనిని రూపొందించడం జరిగింది. అయితే ఇది అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.’హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ’ 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిసి గరిష్టంగా 125 బిహెచ్‌పి పవర్ మరియు 253 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కావున ఇది లీటరుకు 26.5 కిమీ మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్:
టయోటా కంపెనీ దేశీయ విఫణిలో తన ఇన్నోవా హైక్రాస్ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 18.30 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.97 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో పొందుతుంది. డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా అందించబడ్డాయి.ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్ లేదా పెట్రోల్ హైబ్రిడ్ ఆప్సన్స్ ఉంటాయి. కానీ ఇది డీజిల్ ఇంజిన్ పొందే అవకాశం లేదు. కావున ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 172 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున తప్పకుండా ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇందులోని 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి మరియు 187 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 111 బిహెచ్‌పి మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే పవర్ అవుట్‌పుట్ 184 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా:
మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో గత సెప్టెంబర్ నెలలో కొత్త గ్రాండ్ విటారా విడుదల చేసింది. గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.గ్రాండ్ విటారా యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకూండా ఇది సుజుకి యొక్క AllGrip AWD ఆప్సన్ కూడా పొందుతుంది.ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 92 హెచ్‌పి మరియు 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు
టయోటా హైరైడర్:
దేశీయ మార్కెట్లో 2022 లో విడుదలైన హైబ్రిడ్ కార్లలో టయోటా హైరైడర్ ఒకటి. ఇది హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొదటి మిడ్-సైజ్ SUV. ఇది టొయోటా యొక్క 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది.హైరైడర్ మారుతి సుజుకి నుండి మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా పొందుతుంది. కావున ఇందులో 1.5-లీటర్ K15C ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.