ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహించనుంది. యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈమేరకు సభను విజయవంతం చేయాలని కోరారు.
స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది.స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోంది.యువతీ యువకులు అందరూ ఆహ్వానితులే.యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది.
మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.ఉత్తరాంధ్ర యువత ఉపాధి, చదువుల కోసం వలస వెళ్తోన్న పరిస్థితి.నాతో పాటు.. మా పార్టీ నాయకులు పాల్గొంటారు.మేమే కాకుండా యువత కూడా పాల్గొని అభిప్రాయాలు తెలపాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సభ ద్వారా తమ తడాఖా చూపించాలని యువతకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్..