Devotional

TNI నేటి ఆధ్యాత్మిక వార్తలు ..ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు..

TNI  నేటి ఆధ్యాత్మిక వార్తలు ..ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు..

🌻ప్రత్యంగిర తంత్రం.🌻

🔥ప్రతి ఒక్కరు తెలుసుకోదగిన _ విషయాలు.🔥

🏵️🌺🏵️🌺🏵️🌺🏵️🌺🏵️

1.చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట
ఒట్టు పెట్టుట దోషం *

2.నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని __
అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు *         రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు __//

3.నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట __
గోళ్ళుకొరుకుట చేయరాదు __//

4.దేవాలయ ప్రాంగణంలో __
ఉమ్మడం పొగత్రాగటం రెండూ నిషిద్దాలే //

5.ఆదివారం మంగళవారం
అలాగే శుక్రవారం తులసి ఆకులు కోయరాదు //

6.చీకటి పడ్డాక __ పువ్వులు,
ఆకులు __ చెట్లనుండి త్రుంచరాదు //

7.గురువుద్వారా మంత్రోపదేశం __
పొందనివాడు __ ఎప్పటికీ తరించలేడు *
> కనుక ఉపదేశం పొందితీరాలి __//

8.చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే __
వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు
ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు __
ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు //

9.గురువులకు అర్చకులకు
పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక
వారికి ఋణపడేవారు నూరుజన్మలు
కుక్కలుగా చండాలురుగా పుట్టి
కష్ట నష్టాల పాలవుతారు //

10.శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు‌ //

11.ఇంట్లో విగ్రహాలుంటే __
ఏమీ ప్రమాదం లేదు *
పరులకు అపకారం కోరి __
పూజ చేసేవారికి __ మాత్రమే నియమాలు *
తక్కిన వారికి పూజా విషయాలలో
పెద్ద పెద్ద నియమాలు లేవు __//

12.నిద్రనుండి లేవగానే __
ముందుగా అరచేతులను దర్శించి __
వామన నామస్మరణ చేయాలి __//

13.పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు __//

14.హారతి ఇచ్చాక దేవునిపై __
నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు //

15.తీర్థం తీసుకున్నాక __
ఆ చేతిని కడుక్కోవాలి తప్ప
> అరచేతిని తలపై రాసుకొనరాదు __//

16.స్నానం చేశాక శరీరం తుడుచుకొని __
తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు * > పూజా మందిరంలో కి ప్రవేశించరాదు *
పూర్తిగా ఆ తుండును తడిపి __
నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా __
వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి __//

17.ఉపవాసం ఉన్నపుడు __
జాగరణ చేసినపుడు __
పరులదోషాలు తలుచుకోరాదు __//

18.శివాలయంలో నందికి దగ్గరగా __
దీపారాధన చేయరాదు __ కొంచెం దూరం ఉంచాలి //

19.తల వెంట్రుకలతో కూడిన అన్నం __
పండితులకు, గురువులకు పెట్టరాదు *
సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి __!
పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే __
ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి _//

20.అన్నం తింటున్న వారెవరినీ __
> తిట్టరాదు దెప్పి పొడవరాదు //

21,నిజం తెలుసుకోకుండా __
ఎవరినీ నిందించరాదు __
అభాండాలు వేయరాదు‌ *
అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ __
అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి _//

22.ఇస్తానని వాగ్దానం చేసి __
దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్బంగం చాలా దోషం //

23.అన్నం తినేటప్పుడు‌ __
కంచానికి బాగా దగ్గరగా కూరలు __
మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు __*
మనం తినేటప్పుడు ఎంగిలి __
ఆ పాత్రలలో పడితే __
ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే __
వాడికి యముడు మల ముత్రాదులు __
ఆహారంగా ఇస్తాడు __//

24.తరచుగా కాలినడకన __
పుణ్యక్షేత్రాలు దర్శిస్తే __
మంచి జన్మలు కలుగుతాయి *
దీనిని కాయిక తపస్సు అంటారు __//

25.గురువునకు __
ఉపదేశ సమయాలలో కాని __
పురాణాదులు వినేటప్పుడు కాని __
గురువుగారి పాదాలు ఒత్తితే __
7 జన్మల పాపాలు తొలుగుతాయి __//

26.గురువుగారి బట్టలు ఉతికి __
>••• ఆరవేసిన వారికి __
3 జన్మల పాపాలు తొలగుతాయి __//

27.మంత్రోపదేశం చేసిన __
గురుని ఆజ్ఞ పాటించేవారికి __
ఏ పాపమూ అంటదు __*
పునర్జన్మ ఉండదు __*
(ఇది తప్పక పాటించవలసిన ముఖ్య __
పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు) పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి //

28.అష్టమి, పూర్ణిమ, చతుర్థశి __
కాలలో స్వయంపాకం దానం చేస్తే __
అన్నపానాలకు ఏనాడు లోటుండదు __//

29.ఎక్కువ వేడిగా __
ఎక్కువ చల్లగా ఉండే __
పదార్థాలు స్వీకరించరాదు ”

30.భోజనం చేసిన వస్త్రాలు __
ఉతికి ఆరవేయకుండా __
> వాటితో దైవపూజ చేయరాదు __//

31.శవాన్ని స్మశానం దాకా మోసినా __
శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము __//

32.గృహప్రవేశ కాలంలో గాని __
ఏడాదిలోపు గాని ఆ ఇంట __
మణిద్వీప పరాయణం చేయడం మంచిది __*
> ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది __//

33.భోజనానికి ముందు __
అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి //

34.సకల పురాణేతిహాస కోవిదుడు __
కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు //

35.పుట్టిన రోజునాడు దీపాలు కానీ _
కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు *
నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం *
     అటువంటివారు గ్రహణపు మొర్రితో __
మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు //

36.తలకి నూనె రాసుకొని __
ఆ చేతులతో పాదాలకు __
> ఆ నూనె జిడ్డు పులమ రాదు __//