తరాలుగా అమలులో ఉన్న కఠోర ఇస్లామిక్ నిబంధనల కారణాన అంతర్జాతీయంగా మరియు ఆర్ధికంగా తాము నష్టపోతున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ క్రమేణా కొన్ని నియమాలను సడలిస్తుంది. సహాజీవనానికి అనుమతి, హిందువు, క్రైస్తవ సివిల్ చట్టాలను గుర్తించిన యు.ఏ.ఇ ఇప్పుడు తాజాగా మద్యం విక్రయాల పై నిబంధనలను సడలించింది.
దుబాయి చట్టాల ప్రకారం కేవలం రెండు ఏజన్సీలు మాత్రమే మద్యాన్ని అనుమతించబడ్డ నిర్దేశీత ప్రదేశాలలో విక్రయించాలి మరియు సేవించాలి. 21 సంవత్సరాల పైబడి వీసా కల్గి ఉన్న వారు ముస్లిమేతరులు మాత్రమే త్రాగడానికి మరియు దుకాణం నుండి ఇండ్లకు తీసుకోని వెళ్ళడానికి ప్రత్యెకంగా లైసెన్సు పొందాలి దీనికై ఫీజు చెల్లించాలి. ముస్లింలు మద్యం త్రాగడం నిషేధం. అన్ని రకాల మద్యం పై 30 శాతం పన్ను ఉంటుంది.
తాజాగా లైసెన్సు ఫీజును రద్దు చేయడంతో పాటు మద్యం పై పన్నును దుబాయి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గి పర్యాటకలకు ఊరట కల్గుతందని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఉన్న విధంగా మద్యం లైసెన్సు కేవలం ముస్లిమేతరులకు మాత్రమే లేదా ఇస్లాంను అచరించె వారికు కూడ ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయలేదు.
దుబాయిలో ధరలు ఎక్కువ కావడంతో దుబాయి నుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు సమీపంలో ఉన్న ఉమ్మాల్ ఖ్వాన్ కు వెళ్ళి మద్యాన్ని కొనుక్కోని వస్తారు, నాలుగు దిర్హాంలు ఉన్న బీరు సీసా దుబాయిలో క్యాబ్రే బార్లలో 50, మాములు షాపులలో 25 దిర్హాంలకు విక్రయిస్తారు.
ధర ఎక్కువ అయినా కూడ ప్రతి వారంతరానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ, అధికార మరియు సినీ ప్రముఖులు దుబాయికు డ్రింక్ పార్టీకు వస్తుంటారు. ప్రత్యెక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైద్రాబాద్ నగరంలో పెరిగిపోయిన పబ్బుల సంస్కృతి కారణాన దుబాయికు వచ్చె వారి సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పవచ్చు.
దుబాయి కంటె ముందు ఆబుధాబి కూడ మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. అదే దుబాయికు పొరుగున ఉన్న షార్జా ఏమిరేట్ లో మాత్రం మద్యం పై పూర్తి స్ధాయిలో నిషేధం ఉంది. దుబాయి మరియు ఇతర ఏమిరేట్లలో జైళ్ళలో ఉన్న వారిలో తెలుగు వారితో సహా భారతీయులు పెద్ద సంఖ్యలో మద్యం అక్రమ రవాణా నేరాల పై పట్టబడ్డ వారే కావడం గమనర్హాం.