వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30ఏళ్ల వరకు వైకాపాకు తిరుగులేదని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన జగన్.. కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ఖరారు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించిన సీఎం.. చేసిన సంక్షేమాన్ని వివరించి అందరి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థిగా అవినాష్ ఖరారు
Related tags :