Movies

రెండో పెళ్లిపై నటి ప్రగతి కీలక ప్రకటన..

రెండో పెళ్లిపై నటి ప్రగతి కీలక ప్రకటన..

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ, వదిన పాత్రలు అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేర్లలో సీనియర్​ నటి ప్రగతి తప్పకుండా ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలో ఆమె తనదైన నటనతో మెప్పిస్తారు. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లిపై కీలక కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్​ ఆన్సర్​ చెప్పారు. ఏం చెప్పారంటే..
సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్​గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే కొద్ది కాలంగా సినిమాల కన్నా ఎక్కువగా సోషల్‌ మీడియాలోనూ, జిమ్​లోనూ ఫుల్​ యాక్టివ్​గా ఉంటున్నారు. సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేసి.. ఫుడ్‌, బ్యూటీ, వర్కౌట్​ వంటి పలు ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో నెటిజన్లను అలరిస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడారు. రెండో పెళ్లిపై ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా చేసుకోవాలని అనిపించిందా? అని యాంకర్ అడగగా ఇలా సమాధానమిచ్చారు. “పెళ్లి అనేది అవసరం. కానీ ఆ పదం కన్నా కంపానియన్ అనేది చాలా ఇంపార్టెంట్​ అనిపిస్తుంది. చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవెల్​కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. అదీగాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం. కానీ.. రావాలని ఉంటే అది జరుగుతుంది. అయినా నాతో కొంచెం కష్టం. ఎందుకంటే.. కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్​గా ఉంటాను. ఇలాగే కావాలి, అలాగే ఉండాలి అని అనుకుంటాను. ఇప్పుడు 20ల వయసు ఉంటే అడ్జెస్ట్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పుడు కష్టం” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రగతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.