మంత్రి హరీష్ రావు గారిని ఈరోజు బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అద్వ్యర్యములో బెజ్జంకి హన్మంతు తో పాటు అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చ జరిగింది .మొదటగా హన్మంత్ బెజ్జంకి గారు డాక్టర్ల బృందాన్ని మంత్రి హరీష్ రావు గారికి పరిచయం చేసారు AAPI అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్-ఆపి అమెరికాలో అతిపెద్ద వైద్య పూర్వ విద్యార్ధులు, 80000 మంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు ఉన్నారు అలాగే ఉస్మానియా గాంధీ కాకతీయ మరియు తెలంగాణ మెడికల్ అలుమ్ని ఆఫ్ అమెరికా (OGKTMA) తెలంగాణ మరియు హైదరాబాద్ నుండి సుమారు 20000 మంది వైద్యులు వున్నారని తెలిపారు అలాగే అమెరికాకు చెందిన 11 మంది ప్రముఖ తెలంగాణ ఎన్నారై వైద్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం డెలివరీ మరియు మౌలిక సదుపాయాలు దేశములో నే ముందంజలో ఉన్నాయని అన్నారు . హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ గారు మెడికల్ సీట్ల కోసం తెలంగాణా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళే పని లేకుండా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్య విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు.ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాల్సిన అవసరం ఉందని సిఎం గారి సూచనలు చేశారన్నారు , అందులో భాగంగా గర్భిణీ స్త్రీలు, నవజాత శిశు సంక్షేమం గురించి కేసీఆర్ కిట్ స్కీమ్ను,అమ్మ ఒడి పథకం , అలాగే సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన బస్తీ దవాఖానాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు, రాబోయే రోజుల్లో రాష్ట్రములో వివిధ ప్రాంతాలలో బస్తి దవాఖానాలు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వరంగల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే వివిధ ప్రాంతాలలో TIMS ని అభువృద్ది చేసి ప్రజలకి అందిస్తుంది అని అన్నారు . డాక్టర్ల బృందం రాష్ట్రంలోని ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ మరియు పిజి కోర్సు, ఫ్యామిలీ ప్రాక్టీస్ డిపార్ట్‌మెంట్ మరియు పిజి కోర్సుల కోసం మెమోరాండం సమర్పించారు అలాగే తెలంగాణ రాష్ట్ర-విలేజ్ మరియు బస్తీ హెల్త్ క్లినిక్‌లు, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలతో OGKTMA ఎలా భాగస్వామి అవుతుంది.
గ్రామ స్థాయిలో నివారణ చర్యలు, యుఎస్ నుండి మెడికల్ స్టూడెంట్స్ మరియు పిజిలకు రిమోట్ లెక్చర్లు మా పూర్వ విద్యార్థులచే బహిరంగ చర్చలు మరియు సూచనలను ఎలా చేయాలి అని మంత్రి గారికి వివరించారు. హరీష్ రావు అన్నింటికీ సానుకూలంగా స్పందించి రాబోయే వారం పదిరోజుల్లో మల్లి డాక్టర్ల బృందం అలాగే తెలంగాణ విద్య బృందముతో కలిసి అన్ని రకాలుగా చరించడమానై చెప్పారు , మున్ముందు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయం అందిస్తామనని అన్నారు . ఈ భేటీలో dr హన్మంత్ బెజ్జంకి, dr సతీష్ కత్తుల.,dr మెహెర్ మేదేవరం.,dr రఘు లోలాభట్టు.,dr సుజీత్ పున్నం.,dr శ్రీని గంగసాని.,dr హేమ కొర్లకుంట.,dr జితేందర్ రెడ్డి కట్కూరి., dr రామారావు మేడవరం, dr దామోదర్ నేరెళ్ల పాల్గొన్నారు, ఈ భేటీని సమన్వయ పరిచిన బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి dr హన్మంతు బెజ్జంకి మరియు డాక్టర్ల బృందం అభినందించింది