బిగ్ బ్రేకింగ్
ఎన్టీఆర్ జిల్లా – మైలవరం
వెల్వడంలో వైసీపీ నాయకుల బాహబహి.
మట్టి తరలింపు విషయంలో యరమల రాంభూపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తోట తిరుపతిరావు వర్గాల మధ్య ఘర్షణ.
వేసవిలో పొలాల్లో నిల్వ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న రాంభూపాల్ రెడ్డి వర్గీయులు.
మట్టి రవాణాను అడ్డుకున్న తోట తిరుపతిరావు, అనుచరులు.
పరస్పరం కొట్లాటకు దిగిన ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు.
కొట్లాటలో గాయపడిన సొసైటీ అధ్యక్షుడు తోట తిరుపతిరావు, శీలం కృష్ణా రెడ్డి లు.
ఇరువర్గాలను చెదరగొట్టిన మైలవరం ఎస్ ఐ రాంబాబు, సిబ్బంది.
కృష్ణా రెడ్డిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.
మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ లు సీజ్.
గతంలో మట్టి కోసం కొట్లాడుకున్న రెండు వర్గాలు.
మరలా ఘర్షణ జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు.
******************
బ్రేకింగ్
ఎన్టీఆర్ జిల్లా (మైలవరం)
గొల్లపూడి
తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్
తెల్లవారుఝామునే వచ్చి భారీ ఎత్తున మోహరించిన పోలీసులు
ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియక ఆందోళనలో పార్టీ శ్రేణులు
కుప్పం ఘటనపై ముందస్తుగా హౌస్ అరెస్ట్ లు
*********************
కుప్పం ఘటనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు
కుప్పం
నిన్నటి కుప్పం లో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు…
టీడీపీ నేతలపై హత్యయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు కేసులు
రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ లో 3 FIRలు నమోదు చేసిన పోలీసులు*
టీడీపీ కార్యకర్తలపై 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు
దాదాపు 50 మందికిపైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు..
మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది
***********************
ఇక నుంచి నో ఫ్లెక్సీ గొడవలు
⚪️ అమరావతి
◻️ ఏపీలో ఫ్లెక్సీలు పై విధించిన నిషేధాజ్ఞలు ఈ నెల 26నుండి అమల్లోకి…
***********************
పిరికితనంతో తప్పుడు కేసులు.. ఏపీలో అత్యవసర పరిస్థితి: చంద్రబాబు
కుప్పం : సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తమ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కొంతమంది పోలీసులు వాళ్ల స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. కుప్పంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే శాడిస్ట్ సీఎం ఆనందపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. రోడ్డు షోలు, సభలపై నియంత్రణకు చీకటి జీవో తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు తీసుకెళ్లిన తెదేపా చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.
రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా? : ‘‘40 ఏళ్లు పోరాడిన పార్టీ తెదేపా. ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నాం. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా? నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించా. ఇప్పుడు వీళ్లు మాత్రం నా నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే అడ్డుపడుతున్నారు. దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థలో కొందరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడే ఈ పోరాటంలో పోలీసుల సహకారం అవసరం. చట్టాలను అతిక్రమించిన పోలీసులూ నేరస్థులే. జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు వచ్చారా? తెదేపా కార్యకర్తలపై దాడులకు వచ్చారా? రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా? గత 70 ఏళ్ల నుంచి జరగలేదా? జగన్ పాదయాత్రలో రోడ్డుషోలు జరగలేదా?
పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతాం. బోనెక్కిస్తాం : తెదేపా నేతలు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయి. ఇప్పుడు కుప్పంలోనూ ఆ తరహాలోనే చేస్తున్నారు. ఏంటీ అరాచకాలు? అయినా మేం భయపడం.. ప్రజాపోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. పోలీసు వ్యవస్థపై కేసులు పెడతాం. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి బోనెక్కిస్తాం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనుకుంటే.. మీకూ కుటుంబాలు ఉన్నాయి. వాళ్లు బాధపడితే తెలుస్తుంది. 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు.. జగన్ మరో వైపు. వైకాపా నేతలు రాష్ట్రాన్ని కాపాడతారా? సైకో పక్కన ఉంటారా?వాళ్లే ఆలోచించుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.
***************************
ఢిల్లీ
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ దాఖలు పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అని అడిగిన న్యాయమూర్తి ఎం ఆర్ షా
గంగిరెడ్డి బెయిల్ పొందేనాటికి అసలు విచారణే జరగలేదు…కీలక విషయాలేమీ దర్యాప్తులో బయటకు రాలేదు కదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి ఎం ఆర్ షా
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో కేసు తీవ్రత నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయవచ్చని అభిప్రాయపడిన సుప్రీం ధర్మాసనం
గతంలో దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డి కి డిఫాల్ట్ బెయిల్ రావడానికే చార్జిషీటు దాఖలుకు జాప్యం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉందని వ్యాఖ్యానించిన ధర్మాసనం
గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయన్న ధర్మాసనం
ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన ధర్మాసనం
వై ఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి పాత్ర అపరిమితమని దర్యాప్తులో తేలింది: సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్
మెరిట్ పైన కాకుండా డిపాల్ట్ గానే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందన్న సిబిఐ తరపు న్యాయవాది
అటువంటి సమయంలో సాక్ష్యులను బెదిరించినా, ప్రభావితం చేసినా, దర్యాప్తుకు ఆటంకాలు కలిగించినా బెయిల్ రద్దు చేయవచ్చన్న సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్
సిబిఐ దర్యాప్తు తరువాతనే గంగిరెడ్డి ఏ1 అని నిర్ధారణ అయినందున బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామన్న సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్
అందుకే ఆయనను విచారించాలని భావిస్తున్నామన్న సిబిఐ తరపు న్యాయవాది నటరాజన్
గంగిరెడ్డి అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నారన్న ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణ రావు
కావాలంటే నార్కో పరీక్షలు కూడా చేసుకోవచ్చని స్వచ్ఛందంగా గంగిరెడ్డి ముందుకొచ్చిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాది ఆదినారాయణ రావు
వై ఎస్ వివేకా హత్య కేసులో ఏ1 గా ఎర్ర గంగిరెడ్డి
డిఫాల్ట్ బెయిల్ పై బయటకు వచ్చిన గంగిరెడ్డి
గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన సిబిఐ
ఎంఆర్ షా నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ
సిబిఐ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ నటరాజన్
గంగిరెడ్డి తరపున వాదనలను వినిపించిన సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణ రావు
************************
ఇంచార్జ్ అరెస్ట్
⚪️ కందుకూరు
◻️ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు అరెస్టు ….
◻️ హైదరాబాదులోని ఆయన ఇంటివద్ద ఈ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
◻️ ఇటీవల కందుకూరులో జరిగిన దుర్ఘటన విషయంలో నాగేశ్వరరావుపై కేసు నమోదు…నాగేశ్వరరావును ఎక్కడికి తీసుకు వెళ్లారన్నదానిపై అనుమానాలు… ❗️
◻️ ఆందోళనలో కందుకూరు నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు
********************
చంద్రబాబు నరహంతకుండంటూ రాం గోపాల్ వర్మ ఫైర్
కందుకూరు, గుంటూరు ఘటనలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన చంద్రబాబు హిట్లర్, ముస్సోలిని అంతటి దుర్మార్గుడంటూ మండిపడ్డారు. ఎంతమంది చనిపోతే అంత పబ్లిసిటీ అనుకుంటున్నాడు బాబు అంటూ విరుచుకుపడ్డారు ఆర్జీవీ
*********************
జీవో నెంబర్ ఒకటి మరియు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో అడుగుపెట్టనీయకుండా చేస్తున్న విధానానికి నిరసనగా పలుచోట్ల జగన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్న వారిలో భాగంగా గృహనిర్బంధం, హౌస్ అరెస్ట్ చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ నల్లగట్లస్వామిదాసు* ఎక్స్ ఎమ్మెల్యే గారిని తిరువూరు శాంతినగర్ లోని తన సొంత ఇంటిలో హౌస్ అరెస్టు చేయడం జరిగింది.