NRI-NRT

సాయం కోరితే రూ.5 కోట్లు .. ప్రమాదవశాత్తూ ఈ ఎన్నారై దంపతులు మరణించడంతో..

సాయం కోరితే  రూ.5 కోట్లు .. ప్రమాదవశాత్తూ ఈ ఎన్నారై దంపతులు మరణించడంతో..

కాలక్షేపం కోసం వెళ్లిన విహార యాత్ర.. విషాదం మిగిల్చింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో అరిజోనా ప్రాంతంలో నివాసం ఉంటున్న గుంటూరుకు చెందిన..కాలక్షేపం కోసం వెళ్లిన విహార యాత్ర.. విషాదం మిగిల్చింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో అరిజోనా ప్రాంతంలో నివాసం ఉంటున్న గుంటూరుకు చెందిన నారాయణ, హరిత దంపతులు తమ స్నేహితుడు గోకుల్ మేడిశెట్టితో కలిసి గత నెలలో వుడ్స్ క్యానియన్ లేక్(Woods Canyon lake)ను సందర్శించారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు సరస్సులో పడి నారాయణ దంపతులు సహా గోకుల్ మేడిశెట్టి కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నారాయణ దంపతుల ఫ్యామిలీ ఫ్రెండ్ పార్వతి మెట్టు అనే మహిళ జనవరి 3న గో ఫండ్ మీ(GoFundMe) క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌కు భారీగా స్పందన వచ్చింది. దాదాపు 12వేల మంది.. 6,12,296 డాలర్ల(దాదాపు రూ.5.05కోట్లు)ను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్టు పార్వతి తెలిపారు. కాగా.. నారాయణ దంపతులకు 11, 7ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ చిన్నారులు వాళ్ల అమ్మమ్మతాతల వద్ద ఉంటున్నారు.