ఎదిగేకొద్దీ ఒదగాలి! – ఎలా
మనిషి ఎంత ఎదిగినా ఒదిగివుండాలి కానీ అహంకరించకూడదు. అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ దురభిమానం ఎప్పుడూ ఇబ్బందులు కలిగిస్తుంది.
సకలశాస్త్ర పారంగతుడిని అన్న అహంతోనే రావణాసురుడు తప్పు చేసి, శ్రీరాముని చేతుల్లో హతుడైనాడు.
దుర్యోధనుడు దురభిమానం తో తొడలు విరిగి నేలకూలాడు. ఎంతటి తపోధనులైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపఃశక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి. ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొంది, ఆయనను పాండవుల మీదికి పంపుతాడు.
సూర్య వర ప్రసాదంతో అక్షయపాత్ర ను పొందిన పాండవులు ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా వున్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఆ ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుంది. అది తిని భగవానుడు నా కడుపు నిండినది అని త్రేన్చగానే దుర్వాసునికి , అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్ట నిండిపోయి ఆయాసంతో అతలాకుతలం అవుతుంటారు.
ఆ సమయంలో ధర్మజుని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పుడు వారు ‘ఎవరి అండలో’ ఉన్నాడో ఆ లీలామానుష మూర్తిని గుర్తెరిగిన దూర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించు కునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు.
అలాగే విశ్వామిత్రుడు కూడా.! ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజువులు మన పురాణ కథల్లో ఉన్నాయి.
పురాణాలు ..మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, చేయకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి.
మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోక శ్రేయస్సును పెంపొందిస్తారు. నేను, నాది అన్న అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి …
ఓం నమో నారాయణాయ
🕉️🕉️🕉️🕉️🕉️
ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
06-01-23
శుక్రవారం
🕉️ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
🕉️ నిన్న 05-01-2023 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 47,781 మంది…
🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 15,695 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.10 కోట్లు …
🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం…
🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
నెమలి దేవస్థానానికి రూ.4.60 లక్షల విలువైన జనరేటర్ వితరణ
నెమలి (గంపలగూడెం): ఉమ్మడి కృష్ణా
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం హైదరాబాదుకు చెందిన స్వర్గీయ కరెడ్ల ప్రమీల జ్ఞాపకార్థం భర్త కరెడ్ల జనార్ధనరెడ్డి, కుమారుడు కోడలు యుగేంధర్ రెడ్డి శిల్ప, కుమార్తెలు పత్తికొండ కవిత, చిటాని మమత, అల్లుళ్లు విజయరెడ్డి, ప్రదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు రూ.4.60 లక్షల విలువైన 30 కేవి ట్రాన్స్ఫారం ను కొనుగోలు చేసి శుక్రవారం అందచేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖలు తెలిపారు.