Business

మోదీపై అదానీ బ్లాస్టింగ్ కామెంట్స్..

మోదీపై అదానీ బ్లాస్టింగ్ కామెంట్స్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నుంచి ఎవరూ వ్యక్తిగత సహాయం పొందలేరని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు..

మోదీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల తాను లబ్ధి పొందుతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తాను బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తున్నానని గుర్తు చేశారు. ప్రతిపక్షాల విమర్శలు చెల్లుబాటు కావని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”మోదీ నుంచి ఎటువంటి వ్యక్తిగత సహాయాన్నీ మీరు పొందలేరు. దేశ ప్రయోజనాల కోసం విధానాల గురించి ఆయనతో మీరు మాట్లాడవచ్చు. కానీ ఒకసారి విధానం తయారైందంటే, అది అందరి కోసం, కేవలం అదానీ గ్రూప్ కోసం మాత్రమే కాదు” అని అదానీ చెప్పారు.