హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మహేశ్వరంలో భూమి ఇప్పిస్తానని ఓ ఎన్ఆర్ఐని సుధాకర్ మోసం చేశారు. నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు కాజేశారు.సస్పెండ్ అయిన ఓ ఆర్ఐతో కలిసి ఇన్ స్పెక్టర్ సుధాకర్ ల్యాండ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ఆ ఎన్ఆర్ఐ నుంచి ఇన్ స్పెక్టర్ సుధాకర్ రూ.54 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సుధాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
*************
నాకు కుమారులు లేరు.. రాజకీయ వారసులు వాళ్లిద్దరే: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..
నెల్లూరు: తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప కుమారులెవరూ లేరని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.
తనను కుమారుడిగా అంగీకరించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. శనివారం ఆయన విడుదల చేసిన ఓ వీడియో వైరలైంది. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘నాకు ఇద్దరు కుమార్తెలు. కుమారులెవరూ లేరు. నా భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన బిడ్డలు రచనా రెడ్డి, సాయి ప్రేమికా రెడ్డిలే నా రాజకీయ వారసులు. డబ్బుల కోసం నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా రండి. నా వ్యక్తిగత జీవితంపై బురద జల్లాలని చూస్తే భగవంతుడు క్షమించడు’ అని వీడియో సందేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
నేపథ్యమిదీ..
తనను కుమారుడిగా అంగీకరించాలంటూ.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ లేఖతోపాటు పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నా తండ్రి. పద్దెనిమిదేళ్లు నా తల్లితో కాపురం చేసి వదిలిపెట్టారు. మమ్మల్ని రహస్యంగా ఉంచారు. మమ్మల్ని ఎప్పుడూ బయటకు రావద్దని కోరారు. అందుకే ఇన్నాళ్లూ ఆయనను ఇబ్బంది పెట్టలేదు’ అని లేఖలో పేర్కొన్నారు.
మీ సంపద, రాజకీయ వారసత్వం నాకు అక్కర్లేదు. తండ్రిగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మిస్సయ్యాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు, విద్యాభ్యాసం పూర్తయినప్పుడు, వివాహ సమయంలో, చివరకు నాకు బిడ్డ పుట్టినప్పుడూ మీతో పంచుకోలేదు. నేను బయటికి వస్తే మన కుటుంబానికి అవమానమని ఇంతవరకు రాలేదు. నా బాధను అర్థం చేసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.
దీనిపై శివచరణ్‌రెడ్డితో ‘ఈనాడు’ మాట్లాడగా.. ‘ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కుమారుడు లేరని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పడం నన్ను తీవ్రంగా కలచివేసింది. అందుకే ఇప్పుడు బయటికొచ్చా. ఆయనకు కుమారుడు లేకపోతే.. మరి నేనెవర్ని? ఏ ప్రజల ముందు తనకు కుమారులు లేరని చెప్పారో.. వారి ముందే నన్ను పుత్రుడిగా గుర్తించాలి. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మమ్మల్ని పూర్తిగా వదిలేశారు.ఇప్పటికే ఆయనతో నేను, అమ్మ దిగిన చిత్రాలను బయటపెట్టా. కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం’ అని చెప్పారు.
శివచరణ్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పందించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
*************
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ
మొదలైన ప్రక్షాళన
స్వాతి రోడ్డుకు మోక్షం
రోడ్లను కబ్జా చేసి అనధికార వ్యాపారాలు చేస్తున్న వారిపై కొరడా
ఎన్నో ప్రమాదాలు..ఎన్నో ఫిర్యాదులు.. ఎట్టకేలకు స్పందించిన భవానిపురం పోలీసులు వన్ ట్రాఫిక్ పోలీసులు
భవానిపురం సీఐ ఉమర్ ట్రాఫిక్ సిఐ రామచంద్ర రావులను అభినందిస్తున్న స్థానికులు
స్వాతి రోడ్డులో రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారందరినీ, పున్నమి ఘాట్ లో ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు
***********************
మాచర్లలో టెన్షన్ వాతావరణం
పల్నాడు జిల్లా మాచర్లలో ఈరోజు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 144 సెక్షన్ అమలులో ఉంది. టిడిపి నేత బ్రహ్మారెడ్డి తో సహా 23 మంది టిడిపి నేతలు నేడు మాచర్ల కు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం చేయనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
******************
నల్లగొండ : హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలింపు.
మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా గుర్తింపు.
హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన.
హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా.
********************
|| టీడీపీ బ్యానర్లు చింపిన వైకాపా కార్యకర్తలు … ఒకరిపై ఒకరు సోడా బాటిళ్లు, రాళ్ళ దాడులు ||
⛔ పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడులు ⛔
▪️పుంగనూరు నియోజకవర్గం
రొంపిచెర్ల పట్టణంలో ఉద్రిక్తత
▪️చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల పట్టణం బస్టాండులో టీడీపీ బ్యానర్లు చింపిన వైకాపా కార్యకర్తలు.
▪️బ్యానర్లు ఎందుకు చింపారు అంటూ ప్రశ్నించిన టీడీపీ వర్గీయులు
▪️గుమిగూడిన టీడీపీ వైసీపీ కార్యకర్తలు
▪️వైసీపీ వర్సెస్ టీడీపీ ఒకరిపై ఒకరు సోడా బాటిళ్లు, రాళ్ళ దాడులు.
▪️పరిస్థితి అదుపులోకి తీసు కురావడానికి రంగంలోకి దిగిన రొంపిచెర్ల పోలీసులు బలగాలు
▪️పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడులు చేసుకొంటున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.