Politics

ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కెసిఆర్ సన్నాహాలు.

ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కెసిఆర్ సన్నాహాలు.

టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఖమ్మంలో ఈ నెల 18 వ తేదీన భారీ బహిరంగ సభ జరగనున్నది. బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఈ భారీ బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించినందుకు ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు సోమవారం నాడు ప్రగతి భవన్ లో అధినేత సిఎం కెసిఆర్ ను కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేతతో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బిఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు అధినేత సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో.. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్, బండి పార్థ సారథి రెడ్డి, రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, తదితర నేతలున్నారు.