తిరు నీరగన్- శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయం, కాంచీపురం
🌸జగదీశ్వర పెరుమాళ్ సమేత నిలమంగైవల్లి త్తాయార్
🌹స్థలపురాణం :
🌸సృష్టిలో జీవరాశి మనుగడకు నీరు ముఖ్య అవసరము. అటులనే పరమాత్మ అనుగ్రహము లేనిదే సృష్టి మనుగడలేదు. నీరు అతి చిన్న రంధ్రము ద్వారా కూడా పోవగల్గును.
ఆకాశము నుండి నీరు వర్షముగా కొండలు , సముద్రము , అడవులు ఎడారులు. ఊళ్లు ఎల్లెడల కురియును.
🌸జలరాశి పల్లము , మిట్ట ప్రదేశము , పర్వతము , సముద్రము అను తేడా లేక వర్షరూపమున కురియునట్లు , పేద – ధనిక , ఉచ్చ – నీచ , జాతి – మత,
బలహీన – బలవంత , స్త్రీ – పురుష , వృక్ష – జంతు సంతుతులు అన్నింటి యందు పుణ్యకర్మ – భక్తి – విశ్వాస – ప్రేమ విశేషమే కొలమానముగా భగవంతుని అనుగ్రహము ఎట్టి వ్యత్యాసము లేక నిశ్చయముగా యుండును.
🌸ఎవరి హృదయము నందు అతి చిన్న రంధ్రము ద్వారా అయినను భక్తి ఉదయించి భగవద్భావము ప్రవేశించునో , పరమాత్ముని అనుగ్రహమును అదే విధముగా అందు ప్రవేశించును. వేరొక విధముగా – అతి చిన్న రంధ్రము ద్వారా కూడ నీరు ఎట్లు పాత్ర నుండి బయటకు పోవునో , అటులనే చిన్న అవిశ్వాసము – అకృతజ్ఞతలకు మనస్సులో తావిచ్చినచో భగవదనుగ్రహము పోవును.
🌸నీరు ఉపమానముగా ఈ సత్యములను బోధించు విధముగా శ్రీమహావిష్ణువు స్థలమున నీరగదన్ పెరుమాళ్ గా వెలసి భక్తులను అనుగ్రహించు చున్నాడు.
ఈ స్తలంలో పెరుమాళ్ ఎడమ కాలు ఎత్తి ,కుడి కాలిపై కూర్చుని ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది.
🌸ఆలయం ముందు ఆంజనేయ స్వామి విగ్రహం చేతిలో శంఖం మరియు ఒక చక్రంతో ఆశీర్వదిస్తారు.
తిరు నీరగన్, కాంచీపురంలో ఉన్న 108 దివ్య దేశ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం తిరు ఊరగం (ఉలగలంత పెరుమాళ్) ఆలయంలో ఉంది.
🌸ఉలగళంత పెరుమాళ్ మరియు అతని భార్య లక్ష్మిని ఆముదవల్లిగా పూజించే విష్ణువుకు అంకితమైన 108 దివ్యదేశంలో ఇది ఒకటి.
ఈ ఆలయం పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ దేవాలయానికి దగ్గరగా ఉంది.
తిరుక్కర్వణం, తిరుకరాగం, తిరుఓరాగం మరియు తిరునీరాగం అనే నాలుగు విభిన్న దివ్యదేశాలను కలిగి ఉన్న ఏకైక దేవాలయ సముదాయం ఇది దివ్య దేశాలలో ప్రత్యేకమైనది.
🌸ఈ దేవాలయంలోని 5 తలల ఆదిశేషుని రూపంలో ఎమ్పెరుమాన్ వ్యక్తమయ్యాడు. అతను తిరు ఊరగంలోని ఉలగళాంద పెరుమాళ్ పక్కన ఉన్న ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తాడు. ఊరగాం అంటే పాము మరియు భగవంతుడు విష్ణువు మహాబలికి సర్పదేవుడిగా దర్శనం ఇచ్చారు,
ఈ ప్రాంతాన్ని ఊరగం అని పిలుస్తారు మరియు స్వామిని ఊరగథాన్ అని పిలుస్తారు.
🌸ఈ ఆలయంలో ఉత్సవ మూర్తి (ఊరేగింపు దేవత) లేదా ఏ తాయారు లేదు. అవివాహిత స్త్రీలు మరియు సంతానం లేని జంటల ప్రార్థనలను ఈ స్వామి నెరవేరుస్తాడని భావించబడుతుంది.
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నిన్న ఆదివారం,ఈరోజు సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 25వేలమంది వరకు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. రూ.200 ప్రత్యేక దర్శన టిక్కెట్ల ద్వారా 782మంది, రూ.20 దర్శన టిక్కెట్ల ద్వారా 1,621మంది దర్శించుకున్నారు. రాహుకేతు పూజలను.. రూ.500 టిక్కెట్లతో 2,273మంది, రూ.750తో 917మంది, రూ.1,500తో 249మంది, రూ.2,500తో 232 మంది, రూ.5వేల టిక్కెట్లతో 67మంది చేసుకున్నారు. అలాగే ఐదు రకాల ప్రసాదాలు కలిపి 17,791 అమ్ముడైనట్లు ఆలయాధికారులు