Amberpet CI was arrested by Vanasthalipuram Police in property cheating case….
Killer kite Manja….
ఎల్ బి నగర్‌లో బైక్‌పై వెళ్తున్న కుటుంబానికి చుట్టుకున్న చైనా మాంజా…
4 ఏండ్ల చిన్నారి మెడకు చుట్టుకుని తీవ్రగాయాలు…
పాప పరిస్థితి విషమం…
హాస్పిటల్‌కి తరలించిన తల్లిదండ్రులు…
నాగోల్ ఫ్లై ఓవర్‌పై ఘటన
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద 108 కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా
గత 17 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ , తుఫాన్లు వచ్చిన అన్నివేళలా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పని చేసాం
గౌరవ ముఖ్యమంత్రివర్యులు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మాకు ఉద్యోగ భద్రత తో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు కల్పించే సదుపాయాలు కల్పించాలని
కోరుతూ శుక్రవారం ఉదయం ధర్నా నిర్వహించారు…
నెల్లూరు…
నెల్లూరు నగరంలో కొనసాగుతున్న సౌండ్ పొల్యూషన్ ఫ్రీ కోసం పోలీసు ఆపరేషన్
అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్ బిగించిన వాహనాలపై ఉక్కు పాదం మోపుతున్న ట్రాఫిక్ పోలీసులు..
ఇప్పటికే గతంలో 173 సౌండ్ వచ్చే సైలెన్సర్లని రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించిన పోలీసులు
తీరు మారని కొందరు ఆకతాయిలు ఇంకా భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్ లు వాడుతున్నారు ఇలాంటి వారి తాట తీస్తాం సైలెన్సర్ పీకేస్తాం అంటున్న పోలీసులు..
నెల్లూరు జిల్లా ఎస్పీ CH విజయ రావు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో అధిక శబ్దాలు వచ్చేలా సైలెన్సర్ లు బిగిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న ట్రాఫిక్ పోలీసులు
ఈరోజు అయ్యప్ప గుడి సమీపంలో ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దాలు వచ్చేలా సైలెన్సర్ లు బిగించిన వాహనాలను, అలాగే అధిక శబ్దాలతో స్పీకర్లు పెట్టి నడుపుతున్న ఆటోలను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు …
నెల్లూరు నగరంలో ఆటోలో స్పీకర్లు పెట్టి అధిక శబ్దాలు చేస్తే భారీగా జరిమానాలు అప్పటికే వినకుంటే వాహనాలు సీజ్ చేస్తామని అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధిక శబ్దాలు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు…
యుద్ద విమానాలు బాంబులు జార విడిచినట్లు వున్నట్లుండి ఢాం ఢాం అని శబ్దాలు వచ్చే సైలెన్సర్లు బిగించుకుని తిరుగుతున్న కొందరు ఆకతాయిలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు… ఇలాంటి వారిని కూడా గుర్తించి తొందర్లోనే వారి ఆట కట్టించేదానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు..
అలాగే ఇటువంటి ఆకతాయిలుకు, సమాజం పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న వారికి రాజకీయ నాయకులు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ సపోర్టు చేయవద్దని పోలీస్ విధులకు భంగం కలిగించవద్దని ప్రజలు కోరుతున్నారు….
వ్యాపారితో నగ్నంగా మాట్లాడి.. రూ. 2.69 కోట్లు కొట్టేసిన యువతి!
రియాశర్మ పేరుతో వ్యాపారికి ఫోన్
తియ్యని మాటలతో వ్యాపారిని పడేసిన యువతి
నగ్నంగా వీడియో కాల్ చేసి అతడిని కూడా అలా మారమన్న యువతి
ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్
11 మంది ఫోన్ చేసి రూ. 2.69 కోట్లు కొట్టేసిన వైనం
వ్యాపారికి ఫోన్ చేసి తియ్యని మాటలతో అతడిని బోల్తా కొట్టించిన ఓ యువతి ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసి ఏకంగా రూ. 2.69 కోట్లు కొట్టేసింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారికి గతేడాది ఆగస్టు 8న మోర్బికి చెందిన రియా శర్మ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తియ్యని మాటలతో వ్యాపారిని తనవైపు తిప్పేసుకున్న ఆమె.. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసి అతడిని కూడా అలా మారమని చెప్పింది. ఆమె వలలో చిక్కుకున్న వ్యాపారి వెనకాముందు ఆలోచించకుండా అలాగే చేశాడు. అంతే, ఆ దృశ్యాలను రికార్డు చేసిన ఆమె ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది.
ఆ దృశ్యాలు బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో మరో గత్యంతరం లేని ఆయన ఆమె అడిగినంత సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఢిల్లీ ఇన్‌స్పెక్టర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. నగ్న వీడియో క్లిప్ తన వద్ద ఉందని బెదిరించి రూ. 3 లక్షలు వసూలు చేశాడు. ఆగస్టు 14న ఢిల్లీ సైబర్ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పి వీడియో కాల్ భయంతో రియాశర్మ ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొంటూ వ్యాపారి వద్ద నుంచి రూ. 80.97 లక్షలు వసూలు చేశాడు.
ఆ తర్వాత మరికొన్ని రోజులకు సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి ఫోన్ చేసి రియాశర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని, కేసు సెటిల్‌మెంట్ చేసుకోవాలనుకుంటే రూ. 8.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని బయపెట్టాడు. దీంతో అతడు అడిగినంతా చెల్లించుకున్నాడు. ఈ లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగాయి.
ఈ క్రమంలో డిసెంబరు 15న కేసును మూసివేస్తున్నట్టు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు పేరిట ఉత్తర్వులు వచ్చాయి. వాటిని చూసి అవి నకిలీవని గుర్తించిన బాధిత వ్యాపారి ఈ నెల 10న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మొత్తం 11 మంది కాల్ చేసి రూ. 2.69 కోట్లు కాజేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
గురుగ్రామ్: కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం ఆరోగ్యం విషమించడంతో గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాత్రి 10.19 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ప్రియుడిపై మోజు, భర్త దారుణ హత్య
ఏపీలోని విశాఖపట్నంలో వాసవానిపాలేనికి చెందిన జ్యోతికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. జ్యోతి తన ప్రియుడు నూకరాజుతో కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. భర్తకు నిద్రమాత్రలిచ్చి అతను పడుకున్నాక ప్రియుడితో కలిసి తీగతో గొంతు బిగించి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి బూడిదను సముద్రంలో కలిపేసింది. తీరా భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలిశాయి.