వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి భద్రత ను రాష్ట్ర ప్రభుత్వo తగ్గించివేసింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించి నందుకు ఇటీవలవెంకటగిరి నియోజక వర్గ సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయినా ఆనం ను ఘోరం గా అవమానిస్తోంది. నిన్నటికీ నిన్న పోలీసు ఎస్కార్ట్ ను తొలగించిన ప్రభుత్వం హడావుడిగా 2 ప్లస్ 2 పోలీసు భద్రతను తగ్గించివేసింది. వెంకటగిరి నియోజకవర్గం లోని అయిదు పోలీసులు స్టేషన్ల పరిధిలో naxlite ముప్పుతో పాటు ఎర్రచందనం దొంగలు, మాఫియా నుంచి ముప్పు వున్నప్పటికీ రాజకీయాల కారణంగా ఆనం భద్రతను తగ్గించివేసింది. నిన్నటి వరకు వున్న ముప్పు ఒక్కసారిగా ఎందుకు తగ్గిందో పోలీసులు చేపట్టిన భద్రత చర్యలు సమీక్ష అమావేశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో పోలీసు అధికారులు చెప్పాలి. మొత్తానికి పార్టీ లోనుంచి పొమ్మన కుండా పొగ పెడుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే నాలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఆనం కు 1+1 భద్రత కు తగ్గించిన అధికారులు, ప్రజా క్షేత్రంలో ఎప్పుడు తిరగని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు 2ప్లస్ 2 భద్రత కల్పించారు. ఇది జగన్ మార్క్ రాజకీయదందా.