Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు. తిరుమలలో సుప్రభాత సేవ ప్రారంభం

TNI  ఆధ్యాత్మిక వార్తలు. తిరుమలలో సుప్రభాత సేవ ప్రారంభం

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం వేకువజాము నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభమైనవి. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా గత నెల 17తే దీ నుంచి సుప్రభాతం స్థానే తిరుప్పావై పాశురాలను ప్రవచిస్తున్న విషయం తెలిసిందే. ధనుర్మాసం ఘడియలు మంగళవారంతో ముగియనుండడంతో బుధవారం ఉదయాత్పూర్వం సుప్రభాతగానంతో స్వామివారిని మేల్కొలుపుతారు. ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు కూడా ఆదివారంతో ముగియనున్నాయి.