Politics

చాట్రాయి : సీఎం జగన్, చంద్రబాబు ఫోటోలతో జూదం

చాట్రాయి : సీఎం జగన్, చంద్రబాబు ఫోటోలతో జూదం

చాట్రాయి మండలంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరులలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుని ఉండడంతో సోమవారం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఫోటోలను ముద్రించి జూదం నిర్వహించడం పట్ల పలు ప్రజాసంఘాల నేతలు పలువురు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇరు పార్టీలకు చెందిన నేతలు కూడా అభ్యంతరం చెప్పకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వారిపై చర్యలు చేపట్టాలన్నారు.