రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై సి.ఐ సహా నలుగురు సస్పెన్సన్
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై సి.ఐతో సహా నలుగురు సస్పెన్సన్
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం రేంజ్ డి.ఐ.జి
జిల్లా ఎస్పీచే ఘటనపై విచారణ… ప్రాథమిక నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసిన డిఐజి
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులకు డిఐజి ఆదేశాలు జారీ
* ఇలాంటి ఘటనలకు తావిస్తే ఎస్సైలు, సి.ఐ లనే కాదు డీఎస్పీలపై కూడా చర్యలు తప్పవు
– అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్
అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో కురబ రామాంజినేయులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సి.ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు మధు బాబు, గంగన్న, హోంగార్డు రమేష్ లను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను విచారణ అధికారిగా నియమించి ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులకు డిఐజి ఆదేశాలు జారీ చేశారు. పోలీసు స్టేషన్లకు ఎవర్నీ అనవసరంగా