బుధవారము, 18-01-2023, షట్తిల ఏకాదశి.
(శుభాలనిచ్చే షట్తిల ఏకాదశి)
పుష్యమాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు.
ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి.
తెల్ల నువ్వులతో దేవతలకు నివేదన చేయాలి. నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీళ్ళలొ వేసుకుని ఆ నీరు తాగాలి.
ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టాలి. ఏకాదశి వ్రతం అయిన తర్వాత నువ్వుల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత తినాలి.
షట్ అంటే ఆరు. తిల నువ్వులు. షట్టిల ఏకాదశి రోజున నువ్వులతో ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అని పేరు వచ్చింది.
1) స్నానం (తిలాస్నానం),
2) స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం.
3) ఇంటిలో తిల హోమం నిర్వహించడం.
4) పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం.
5) నువ్వులు కాని, నువ్వుల నూనె కాని దానం ఇవ్వడం.
* వివేకానందుడికి తినడానికి ఒకరోజు ఏమీ దొరకలేదు… అప్పుడు ఏం జరిగిందంటే?
ఒకసారి స్వామి వివేకానంద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం ఎవరూ సన్యాసులు అవకూడదు అతడిలా అని స్వామీజీతో అన్నాడు.
ఓ స్వామీ… చూడు… చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. మరి నువ్వో … ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా… ఆకలి బడలిక.. తప్ప.. అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.
అప్పుడు ఒక అద్బుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాం చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే… పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్నపీట వేసి భోజనం ఒక ఆకు మీదకు మారుస్తూ… లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.
నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో… అదే అభయ హస్తమిది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. అశ్రునయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే… కాబట్టి ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు. సే::𝓂𝒶𝒹𝒽𝒶𝓋𝒶 𝓀❁𝓁𝓁𝒾 🕊 🕊