టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం యాత్రకు ఇంకా ప్రభుత్వ అనుమతి లభించలేదు.
జనవరి 12న రాష్ట్ర డీజీపీ, హోమ్ సెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డిఎస్పీలకు యువ గళం యాత్ర కు అనుమతి కోరుతూ టీడీపీ లేఖలు రాసింది.
అనుమతి ఇస్తున్నాం అని కానీ అనుమతి నిరాకరించాం అని కానీ ప్రభుత్వం, పోలీసు శాఖ స్పందించలేదు.
పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన స్టేట్ మెంట్స్‌ను టీడీపీ బయట పెడుతోంది. అనుమతి ఇచ్చినా, ఇవ్వక పోయినా యువ గళం యాత్ర జరిగి తీరుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.