అమరావతి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖపై స్పందించిన డీజీపీ – లోకేష్ పాదయత్రకు అనుమతి కోసం వర్ల రామయ్య రాసిన లేఖపై స్పందన – పలు వివరాలు కోరుతూ వర్ల రామయ్యకు లేఖ రాసిన డీజీపీ – ప్రతి జిల్లాలో పాదయాత్ర జరిగే తేదీ, స్థలం, సమయం వివరాలు ఇవ్వాలని కోరిన అధికారులు – జిల్లాలో రూట్ మ్యాప్ లు, ఎందరు పాల్గొంటారనే వివరాలు ఇవ్వాలని లేఖలో కోరిన డీజీపీ – పాదయాత్రలో వినియోగించే వాహనాలు, వాటి నంబర్లు, రాత్రి బసచేసే ప్రాంతం వివరాలు ఇవ్వాలని కోరిన డీజీపీ – జిల్లాలో సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరిన డీజీపీ – రేపు ఉదయం 11 గంటలలోగా వివరాలు అందజేయాలని కోరిన డీజీపీ