DailyDose

అమెరికాలో తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అరుదైన గౌరవం

అమెరికాలో  తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అరుదైన గౌరవం

అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహల్ తమ్మన కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్ CNN హీరోస్ కార్యక్రమంలో శ్రీనిహాల్ తమ్మనను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీనిహాల్ రియల్ హీరో అనిప్రశంసించింది. ఇంతకీ శ్రీనిహాల్ తిమ్మన 13 ఏళ్ల వయస్సులోనే సమాజ శ్రేయస్సు కోసం.. పర్యావరణ మేలు కోసంవినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. అందరూ వాడి పడేస్తున్న బ్యాటరీలనుసేకరించి వాటిని రీ సైక్లింగ్ చేసే ప్రక్రియను చేపట్టాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవిపర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యనుపరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చేఅనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించే పనికిశ్రీకారం చుట్టాడు. వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపించాడు. సీఎన్ఎన్ ఛానల్ శ్రీ నిహల్ చేసిన సేవలనుగుర్తించింది. సమాజంలో మార్పులు కోసం శ్రమించే.. సమస్యలకు పరిష్కారాలు వెతికే రియల్ హీరోస్‌ను సీఎన్ఎన్ హీరోస్పేరుతో సత్కరిస్తుంది. శ్రీ నిహల్ రియల్ హీరో అని సీఎన్ఎన్ ప్రశంసించింది. అతడిని సత్కరించింది. ప్రస్తుతం శ్రీ నిహాల్ NEW JERSY LO ఉంటున్నాడు.