Devotional

శకుని కి ఆలయం

శకుని కి ఆలయం

కౌరవుల మేనమామ అయిన శకుని గొప్ప శివభక్తుడు. గాంధారదేశ రాజకుమారుడు🌺👈

అలనాటి గాంధారమే యీనాటి ఆఫ్గన్ స్ధాన్.

ఆదేశపు రాజు సుబలనుని పుత్రుడు.🌺👈

కురు పితామహుడైన భీష్మునితో గల వైరం వలన తన పగ తీర్చుకునేందుకు కౌరవులతో బంధం ఏర్పరుచుకుని కురువంశ సమూలనాశనానికి కారకుడై తన చిరకాల పగ తీర్చుకున్నాడు. చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో సహదేవుని చేతిలో హతమైనాడు.🌺👈

కర్మానుసారమే మనిషి జీవిత విధానం ఏర్పడుతుందని కర్మసిధ్ధాంతం చెపుతుంది.
విధిని అనుసరించి కర్మ నడుస్తుంది.🌺👈

స్థితికారకుడైన మహావిష్ణువు శ్రీ కృష్ణునిగా అవతరించి చేసిన లీలలు అనేకం.🌺👈

కృష్ణుని లీలలలో శకుని కూడా ఒక భాగం. జూదరూపంలోని దుర్మార్గుల వినాశనానికి కారణమైనవాడు శకుని. అది చేయించిన సూత్రధారి కృష్ణుడు.🌺👈

అభిమన్యుడు భార్య అయిన ఉత్తరకు ఒక మాయాదర్పణం బహుకరించ బడింది. దాని ముందు ఎవరు నిలబడినా వారి మనసులో ఎవరిని తల్చుకుంటూవుంటారో వారి రూపం అద్దంలో ప్రతిఫలిస్తుంది.🌺👈

ఆ అద్దంముందు కృష్ణుడు నిలబడగానే అందులో శకుని రూపం కనపడింది.🌺👈

ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మ సాధనంగా వుపయోగపడినది శకుని.

అటువంటి శకుని మామకు కేరళ రాష్ట్రంలో ఒక ఆలయం నిర్మించబడి భగవంతునిగా పూజించబడు తున్నాడు.🌺👈

పాండవుల అజ్ఞాతవాస సమయంలో కౌరవులు వారికోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని ఆశించారు. అందుకోసం ఈనాటి కేరళ ప్రాంతంలో ఒక చోట అనేక ఆయుధాలు రహస్యంగా దాచివుంచారు. ఆ ప్రాంతమే ‘పగుత్తీశ్వరమ్.’🌺👈👈

ఇప్పుడు ‘పవిత్రేశ్వరం’ అనేపేరుతో పిలువబడుతున్న ‘పగుత్తీశ్వరమ్’ ఊరి సరిహద్దులలో…’మాయంగోడుమాలన్ సరవుమలనడా’ అనే ఆలయం వున్నది.🌺👈

ఇక్కడ ‘శకుని’ ప్రధాన దైవంగా పూజించబడుతున్నాడు.🌺👈

భీష్ముని పై ప్రతీకారం కోసం తను చేసిన పాపాలకు ఆవేదనచెందిన శకుని, ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుని ప్రార్ధించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్ధలపురాణం వివరిస్తున్నది.
భువనేశ్వరిదేవి నాగరాజు యీ ఆలయంలో ఉపదేవతలుగా దర్శనమిస్తున్నారు.👈🌺

శకుని ఆలయం ప్రహారీగోడలతో నిర్మించబడినా పై కప్పు గాని, తలుపులు గాని లేవు. భక్తులు అన్ని వేళలా వచ్చి దర్శనం చేసుకొనవచ్చును. మూలవిగ్రహం శకుని విగ్రహం సమీపమున ఒక గద కూడా వున్నది. ఆ విగ్రహానికి ఎదురుగా వున్న ఒక వేదిక పై భక్తులు తాము తెచ్చి పూజా సామగ్రులు , ప్రసాదాలు అమరుస్తారు.🌺👈

ఈ ఆలయానికి దిగువ భాగాన అక్కడ నివసించే కొండ జాతుల వారి కులదైవ ఆలయాలు వున్నవి.

శకుని మంచివాడే. పరిస్థితుల ప్రాబల్యంతో తప్పులు చేశాడని కొన్ని తెగల ప్రజలు శకునిని పూజించారు.👈

ఈనాటికి ఇక్కడ వున్న దొమ్మరి జాతి వారు శకుని తమను కాపాడే దైవంగా నమ్మి పూజలు ఉత్సవాలు జరుపుతారు.🌺👈

పగవారి వలన తమకు ఎటువంటి బాధలు కలుగకూడదని శకునిని వేడుకుంటారు. పొంగల్ ను నివేదనగా పువ్వులు, పళ్ళు, కల్లు,పట్టు వస్త్రాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అర్చనలు చేసి పూజిస్తారు.🌺👈

ఈ ఆలయ నిర్వహణా బాధ్యతను ఆదివాసుల, దేశదిమ్మరుల కుటుంబాలవారు నిర్వహిస్తున్నారు.🌺👈

ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే మాసాలలో కోలాహలంగా పెద్ద ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో జనాలు ఉత్సాహంగా పాల్గొంటారు.🌺👈

ఈ పవిత్రేశ్వరం కేరళ రాష్ట్రం..కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో వున్నది.
తిరువనంతపురం నుండి 64 కి.మీ దూరం, కొల్లం నుండి 42 కి.మీ దూరం. కొట్టారక్కరా నుండి 13 కి.మీ ప్రయాణంచేసి వస్తే శకుని ఆలయానికి చేరుకోవచ్చును .🌺

🔥సర్వేజనాసుఖినోభవంతు 🔥