టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది.
నటుడు సుధీర్‌వర్మ బలవన్మరణానికి పాల్పడ్డారు.
వ్యక్తిగత కారణాలతో విశాఖలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
‘కుందనపు బొమ్మ’ ‘సెకండ్ హ్యాండ్’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ చిత్రాల్లో సుధీర్ నటించారు.
ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సుధీర్ మృతి విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
సుధీర్ మరణం దిగ్భ్రాంతికరమని దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.