Devotional

TNI. ఆధ్యాత్మిక వార్తలు. కుంభకోణ కాళహస్తీశ్వరుడు

TNI. ఆధ్యాత్మిక వార్తలు. కుంభకోణ కాళహస్తీశ్వరుడు

🔱కుంభకోణ కాళహస్తీశ్వరుడు🔱

కుంభకోణంలో కావేరికి  దక్షిణతీరాన
కాళహస్తీశ్వరుని ఆలయం వున్నది.
తంజావూరు ని పాలించిన శరభోజీ మహారాజు నిర్మించిన ఆలయం యిది.
ఈ ఆలయంలోని ఈశ్వరుడు కాళహస్తీశ్వరుడుగా అనుగ్రహిస్తున్నాడు. అమ్మవారు
జ్ఞానాంబిక.
ఈ ఆలయంలో పూజలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో
వాయులింగమున్న శ్రీ కాళహస్తీశ్వరుని
పూజించిన  పుణ్యఫలితం లభిస్తుంది.

ఇండియాలోనే అతి పురాతనమైన శివలింగం
ఆంధ్రప్రదేశ్ లోని  గుడిమల్లం గ్రామ ఆలయంలో  వున్నది.  ఈ శివలింగం
క్రీ.ము.2 వ శతాబ్దానికి చెందినదిగా భావించబడుతున్నది.

సాధారణంగా ఈశ్వరుని ఆలయాలు తూర్పుముఖంగాగాని పడమటముఖంగా గాని వుంటాయి.
కాని కుళిత్తలై లో వున్న కదంబవననాదరు ఆలయం  ఉత్తర ముఖంగా వున్నది.
కాశీ విశ్వనాధుని ఆలయం వలెనె
కావేరీ తీరాన ఉత్తరముఖంగా వున్న
ఆలయం యిది.
ఏకలింగంపై వేయి లింగాలు చెక్కబడిన  సహస్రలింగంగా పూజలందుకుంటున్నది.
తిరువిరించి,
శ్రీకాళహస్తి ఆలయాలలో కూడా
సహస్రలింగ శివలింగాలను
దర్శించవచ్చును.