న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు..
ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదు అయ్యింది. జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత అప్‌డేట్ అందాల్సి ఉంది..