Movies

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మనవరాలితో హీరో శర్వానంద్ పెళ్లి

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మనవరాలితో హీరో శర్వానంద్ పెళ్లి

హీరో శర్వానంద్ (Sharwanand) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలిని శర్వా పెళ్లిచేసుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి పెళ్లికూతురు పేరేంటి, ఆమె పూర్తి వివరాలు మీకోసం.

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో హీరో శర్వానంద్ (Sharwanand) ఒకరు. అయితే, ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఓ ఎన్‌ఆర్‌ఐను శర్వానంద్ పెళ్లాడబోతున్నారని అన్నారు. ఆ తరవాత రెడ్డి సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని శర్వా పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆ అమ్మాయి పనిచేస్తోందని అన్నారు. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఆ అమ్మాయి పూర్తి వివరాలు బయటికి వచ్చాయి.

శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఈమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అట. అంతేకాదు, చిత్తూరు (ప్రస్తుతం తిరుపతి) జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు.. శ్రీకాళహస్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. త్వరలోనే రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్లాడబోతున్నారట. రెండు కుటుంబాలు త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాయని తెలుస్తోంది