సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కీలకంగా నిలిచిన ఆయనకు ఏపీ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. అటు తెలంగాణ నుంచి చినజీయర్ స్వామీజికి పద్మ భూషణ్ అవార్డు దక్కింది.
6-పద్మ విభూషణ్, 9-పద్మభూషణ్, 91-పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ పద్మ అవార్డులు:
స్వామి చిన జీయర్ – పద్మభూషణ్ ,
శ్రీ కమలేష్ డి పటేల్ – పద్మభూషణ్,
హనుమంతరావు పసుపులేటి – వైద్యం – పద్మశ్రీ
శ్రీ మోదడుగు విజయ్ గుప్తా – సైన్స్ అండ్ ఇంజనీరింగ్ – పద్మశ్రీ.
ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ పురస్కారాలు
శ్రీ ఎం.ఎం.కీరవాణి – కళ,
శ్రీ సి.వి.రాజు – కళ,
శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వరరావు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
శ్రీ సంకురాత్రి చంద్ర శేఖర్ – సామాజిక సేవ,
శ్రీ ప్రకాశ్ చంద్ర సూద్ – సాహిత్యం మరియు విద్య,
శ్రీ గణేష్ నాగప్ప కృష్ణరాజంగర – సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి – కళ,