శృంగేరి శారదా పీఠం
ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది.
దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు.
శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది.
దక్షిణ భారతదేశంలో
ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ మఠానికి ప్రధాన వేదం.
ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు.
ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది.
చరిత్ర
శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది.
ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము మరియు సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది.
ఈ రెండు సంఘటనలు చూశాక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు.
ఆది శంకరులు ఇక్కడ 12 సంవత్సరాలు
గడిపారు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో,
కంచి లో,బదరిలో, ద్వారకలో మఠాలను స్థాపించారు.
🙏 జయజయ శంకర…హరహర శంకర 🙏