విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి సన్నిదానంలో అక్షరాభ్యాసలతో పాటు, అన్నప్రసన్నాలకు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీపంచమి సందర్భంగా ఏపీ నుండే కాకుండా తెలంగాణ, యూపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు.