తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “యువగళం” పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఖతార్ లో కుండపోతగా కురుస్తున్నవర్షాన్ని కూడా లెక్కచెయ్యకుండా సభ్యులందరు ఈ పాదయాత్ర కార్యక్రమానికి హాజరై “జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై యువగళం” అంటూ నినాదాలు చేస్తూ తమ మద్దతును తెలియచేసారు. ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమణ గారితో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, గోవర్ధన్, రమేష్, కిరణ్, వాసు, రవికిశోర్, సతీష్ బాబు, శబరీష్, సాయి రమేష్, వెంకప్ప , సతీష్, ఫణి మరియు పలువురు సభ్యులు హాజరు అయ్యారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలని, పని తీరుని, ప్రజల పట్ల వ్యవహరిస్తున్నవిధానాలను ఎండగడుతూ నిర్వహిస్తున్న నారా లోకేష్ పాదయాత్ర తెలుగు దేశం పార్టీకు, పార్టీ శ్రేణులకు మరింత మనోబలం ఇస్తుందని, తప్పక విజయవంతం అవుతుందని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.