Walking Benefits For Health :మనలో చాలా మందికి ఉదయం వాకింగ్ చేయటం ఒక అలవాటుగా ఉంటుంది. అయితే కొంత మంది వాకింగ్ చేయరు. ప్రతి రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మారిన జీవనశైలిలో ఎక్కువ సేపు కూర్చొని ఉండటం అలవాటుగా మారింది. కంప్యూటర్ ముందు కూర్చొని గంటల కొద్ది పనులను చేస్తున్నారు.
అలా ఎక్కువ సమయం కూర్చొని ఉండటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల 20 నిమిషాల పాటు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్పుతున్నారు. కూర్చొని వ్యాయామం చేయటం కన్నా వాకింగ్ లేదా జాగింగ్ చేస్తేనే మంచి పలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.
వాకింగ్ చేయటం వలన కండరాలు చురుకుగా పనిచేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర మరియు రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయటం వలన ఒత్తిడి, చిరాకు వంటివి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి వంటి సమస్యలు ఉండవు.
వాకింగ్ చేయటం వలన శ్వాస రేటు పెరుగుతుంది, ఆక్సిజన్ రక్తప్రవాహంలో వేగంగా ప్రయాణించేలా చేస్తుంది. శరీరంలో వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. శక్తి స్థాయిలు పెరగటమే కాకుండా నయం చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా తగ్గుతాయి.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది. కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో 20 నిమిషాలు నడిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.