మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని హైదరాబాద్
కార్యాలయంలో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా
విచారించారు. దాదాపు 4 గంటలకు పైగా విచారణ
సాగింది. కేసుకు సంబంధించి అవినాశ్ చెప్పిన
సమాధానాలకు అధికారులు వీడియో రికార్డ్ చేశారు.
కాగా, విచారణ నేపథ్యంలో ఆయన అనుచరులు
భారీగా కార్యాలయానికి చేరుకున్నారు.