తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా దుబాయిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించింది.
యు.ఏ.ఇ తెలుగు దేశం శాఖ అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం జి.సి.సి. సభ్యుడు ఖాదర్ బాషా, పార్టీ నాయకులు మజ్జీ శ్రీనివాస్, యన్. శ్రీనివాస్, వీరవల్లి వినాయక్, కాల సత్య, వాసురెడ్డి మరియు తదితరులు పాల్గోన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కొరకు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో వంతుల వారీగా సభ్యులు దుబాయి నుండి వెళ్ళి పాల్గోనాలని నిర్ణయించినట్లుగా ఖాదర్ బాషా పెర్కోన్నారు.
వాస్తవానికి శుక్రవారం జరగవల్సిన ఈ సమావేశం దుబాయిలోని వర్ష పరిస్ధితుల కారణాన వాయిదాపడి ఆదివారం జరిగింది.