Politics

తారకరత్నను పరామర్శించేందుకు Jr ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్నాడని ఆస్పత్రికి కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిని పంపిన కర్ణాటక సీఎం

జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌… బెంగళూరు నారాయణ హృదయాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు.

బెంగళూరు నారాయణ హృదయాలకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, నారా బ్రాహ్మణి సహా ఇతర కటుంబ సభ్యులు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని వారు కోరినట్లు తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్.. వస్తున్న విషయం తెలియడంతో.. నారాయణ హృదయాలకు కర్నాటక హెల్త్‌ మినిస్టర్‌ సుధాకర్‌‌ను పంపారు సీఎం బొమ్మై. తారకరత్న హెల్త్‌ కండీషన్‌పై కర్నాటక హెల్త్‌ మినిస్టర్‌ ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని సీఎం.. మినిస్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. తారక్, కళ్యాణ్ రామ్ ఆయనతో కూడా మాట్లాడారు