Politics

తారకరత్నకు తాత గారి ఆశీస్సులు ఉన్నాయి.. ఎన్టీఆర్

తారకరత్నకు తాత గారి ఆశీస్సులు ఉన్నాయి.. ఎన్టీఆర్

NTR: తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం ఉంది.. వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్‌..

బెంగళూరు: తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న కుటుంబసభ్యులతో ఎన్టీఆర్‌ మాట్లాడారు..

వైద్యం అందుతున్న తీరు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

”తారకరత్న పోరాడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉంది. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాను.. కొంత స్పందన కనిపించింది. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక కుటుంబసభ్యుడిగా వారు నాకు ధైర్యం చెప్పారు. అభిమానులు, అందరి ప్రార్థనలతో తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆశిస్తున్నాం. తాతగారి ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఆయనకు బలంగా ఉన్నాయి. అభిమానుల ప్రత్యేక పూజలతో తారకరత్న పూర్వస్థితికి వస్తారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వం తరఫున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ఎంతో సహకరించారు” అని ఎన్టీఆర్‌ చెప్పారు.