Politics

హైకోర్టులో వాదనలు వినిపించిన కె ఏ పాల్

హైకోర్టులో వాదనలు వినిపించిన కె ఏ పాల్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్‌గా వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపించారు.

రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని వాదించారు.

మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించిందని, కౌన్సిల్‌కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని వాదించారు.

మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది.