సైబరాబాద్ పరిధిలో వేరు వేరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న మూడు ముఠాలను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
కేసు :1
ఆన్ లైన్ గేమింగ్ కు పాల్పడుతున్న ఇంటర్ నేషనల్ గ్యాంగ్ అరెస్టు
ఎనిమిది మందినిందుతుల నుంచి పలు బ్యాంకుల అకౌంట్ లో 42 కోట్లు సీజ్, 193 మొబైల్ ఫోన్లు, 21 ల్యాప్ టాప్స్, 21 సేల్ డివైస్, 416 చెక్ బుక్స్, 233 డెబిట్ కార్డ్స్ స్వాధీనం
కేసు :2
ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్స్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు అరెస్టు. 17 డెబిట్ కార్డు, 3 బ్యాంకు పాస్ బుక్, 4 మొబైల్, నకిలీ లోన్ ఆఫర్ లెటర్స్ స్వాధీనం.
కేసు: 3
నిరుద్యోగులకు పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్ లైన్ లో డబ్బులు దండుకుంటున్న ఆరుగురు నిందితుల అరెస్టు. 15 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్ టాప్, 1 ప్రింటర్, 3 డెబిట్ కార్డ్స్ స్వాధీనం.
అన్ లైన్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఆన్ లైన్ మోసాల భారిన పడినట్లు తెలిస్తే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు.